త్వరగా రీసర్వే చేపట్టాలి
ABN, First Publish Date - 2023-03-24T00:10:46+05:30
జిల్లాలో భూ రీసర్వే పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి.సాయిప్రసాద్ ఆదేశించారు. రెండో విడత రీసర్వే పనులపై కలెక్టర్, జెసీతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు.
అరసవల్లి: జిల్లాలో భూ రీసర్వే పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి.సాయిప్రసాద్ ఆదేశించారు. రెండో విడత రీసర్వే పనులపై కలెక్టర్, జెసీతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు. ఫేజ్-1 కింద చేపట్టిన రీ సర్వే అప్లోడింగ్కు బీఎల్ఆర్ పద్ధతిని వినియోగించా లని సూచించారు. కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్ మాట్లాడుతూ.. జిల్లాలో డ్రోన్ పద్ధతిలో బీఎల్ఆర్ని పూర్తి చేస్తున్నామని, రీసర్వే వేగవంతంగా జరుగుతోందని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ ఎం.నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, సర్వే ల్యాండ్ రికార్డుల సహాయ సంచాలకుడు కె.ప్రభాకరరావు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-24T00:10:46+05:30 IST