నల్ల బ్యాడ్జీలతో రెవెన్యూ ఉద్యోగులు నిరసన
ABN, First Publish Date - 2023-03-25T23:45:43+05:30
ప్రభుత్వం ద్వారా పరిష్కారం కావాల్సిన పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరు తూ శనివారం పోలాకి రెవెన్యూ సిబ్బంది నల్లబాడ్జీలు ధరించి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
పోలాకి: ప్రభుత్వం ద్వారా పరిష్కారం కావాల్సిన పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరు తూ శనివారం పోలాకి రెవెన్యూ సిబ్బంది నల్లబాడ్జీలు ధరించి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీటీ పొదిలాపు శ్రీనివాసరావు మాట్లాడు తూ.. ప్రతీ నెలా 1వ తేదీన జీతాలు చెల్లిం చాలని, డీఏ బకాయి లు, బోనస్ చెల్లించా లని డిమాండ్ చేశారు. ఇందుకోసం వర్క్ టూ రూల్ నినాదంతో పని చేస్తున్నట్టు తెలిపారు.
- నరసన్నపేట: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేవరకు ఉద్య మాన్ని కొనసాగిస్తామని రెవెన్యూ ఉద్యోగుల సంఘ నాయకులు హేమసుందర్ అన్నారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వర్కు టూ రూల్ విధానం అనసరిచరిస్తూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-25T23:49:33+05:30 IST