సుబ్బారావు పాణిగ్రాహి ఆశయాలు కొనసాగించాలి
ABN, Publish Date - Dec 23 , 2023 | 12:15 AM
విప్లవ చైతన్యాన్ని రగిల్చిన గొప్ప వ్యక్తి సుబ్బారావు పాణిగ్రాహి అని వక్తలు కొనియాడారు. సుబ్బారావు పాణిగ్రాహి 54వ వర్ధంతిని బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ప్రజాకళామండలి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వ హించారు.
బొడ్డపాడు(పలాస): విప్లవ చైతన్యాన్ని రగిల్చిన గొప్ప వ్యక్తి సుబ్బారావు పాణిగ్రాహి అని వక్తలు కొనియాడారు. సుబ్బారావు పాణిగ్రాహి 54వ వర్ధంతిని బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ప్రజాకళామండలి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వ హించారు. ఆయన చిత్రపటానికి భార్య సురేఖా పాణిగ్రాహి పూలమాల వేసి నివాళులర్పించారు. యన ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఈ విప్లవ గీతాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి, విరసం రాష్ట్ర నాయకులు పాణి, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, కె.నీల కంఠం తదితరులు పాల్గొన్నారు. సూదికొండ కాల నీలో సీపీఐఎంల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు ఆధ్వర్యంలో సుబ్బారావు పాణిగ్రాహి వర్ధంతి నిర్వహించారు. కాలనీలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. 1969లో పోలీసు కాల్పుల్లో అమరుడైన సుబ్బారావు పాణిగ్రాహి నేటికీ ప్రజల హృదయా ల్లో నిలిచారని, ఆయన ఆశయాలను కొనసాగిం చాలని కోరారు. కార్యక్రమంలో వీరాస్వామి, మామిడి భీమారావు, సోమేశ్వరరావు పాల్గొన్నారు.
Updated Date - Dec 23 , 2023 | 12:16 AM