ఎర్రన్నతో అనుబంధం మరువలేనిది

ABN, First Publish Date - 2023-04-19T23:57:49+05:30

కేంద్రమాజీ మంత్రి, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడుతో అనుబంధం మరువలేనిదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.

ఎర్రన్నతో అనుబంధం మరువలేనిది
వెంకయ్యనాయుడికి ఆదిత్యుడి విగ్రహాన్ని బహూకరిస్తున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

అరసవల్లి, ఏప్రిల్‌ 19: కేంద్రమాజీ మంత్రి, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడుతో అనుబంధం మరువలేనిదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం శ్రీకాకుళం నగరంలోని సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్రహానికి ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయు డుతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నగరంలోని ఎంపీ నివాసానికి చేరుకున్నారు. ఎంపీ కార్యాల యం వద్ద పలువురు ప్రముఖులు ఆయనను మర్యాదపూర్వ కంగా కలిశారు. తొలుత దివంగత నేత ఎర్రన్నాయుడు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీ కుటుంబ సభ్యుల యోగ క్షేమాలను అడిగి తెలు సుకున్నారు. స్వర్గీయ ఎర్రన్నాయుడుతో తనకు గల అను బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజల బాగోగుల కోసం నిరంత రం ఆలోచించే ఎర్రన్నాయుడు.. తనకు అత్యంత ఆప్తుడని, ఆయన కుటుంబంపై తనకు మమకారం అలానే ఉందని స్పష్టం చేశారు. అనంతరం అల్పాహార విందు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ దంపతులు ఆయన కు అరసవల్లి సూర్యనారా యణ స్వామివారి విగ్ర హాన్ని బహూకరిం చారు. ఆయన్ను కలిసిన వారిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, కలమట వెంకటరమణ, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు గొండు శంకర్‌, టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, జల్లు రాజీవ్‌, బుక్కా యుగంధర్‌, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు మెండ దాసునాయుడు తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-04-19T23:57:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising