ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపే నింగిలోకి ఎస్‌ఎస్2ఎల్వీ-డీ2

ABN, First Publish Date - 2023-02-09T03:34:52+05:30

ఇస్రో అభివృద్ధి చేసిన రెండో స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎ్‌సఎల్వీ) అంతరిక్షయానానికి సర్వం సిద్ధమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు ప్రయోగ రిహార్సల్‌

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 8: ఇస్రో అభివృద్ధి చేసిన రెండో స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎ్‌సఎల్వీ) అంతరిక్షయానానికి సర్వం సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) నుంచి శుక్రవారం ఉదయం 9:18 గంటలకు ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ2 రాకెట్‌ మూడు ఉపగ్రహాలను మోసుకొని రోదసీలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ బుధవారం షార్‌కు చేరుకొన్నారు. షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌, శాస్త్రవేత్తలతో కలసి ప్రథమ ప్రయోగ వేదికపై ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ2 రాకెట్‌ను పరిశీలించి ప్రయోగ వివరాలు తెలుసుకొన్నారు. ప్రయోగానికి సంబంధించిన మిషర్‌ రెడీనెస్‌ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్‌) బుధవారం మధ్యాహ్నం షార్‌లోని బ్రహ్మప్రకాశ్‌ హాలులో జరిగింది. ఈ రాకెట్‌ ద్వారా భూ పరిశీలన కోసం భారత్‌కు చెందిన ఈవోఎస్‌-07 (156.3 కిలోలు) ఉపగ్రహంతోపాటు విద్యార్థులు రూపొందించిన ఆజాదీ శాట్‌-2 (8.7 కిలోలు), అమెరికాకు చెందిన జానస్‌-1 (10.2 కిలోలు) ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. రాకెట్‌ ఉపగ్రహాలను 15 నిమిషాల్లోనే 450 కి.మీ. ఎత్తులోకి తీసుకెళ్లి అనంతరం కక్ష్యలోకి విడిచిపెట్టనుంది. ప్రయోగానికి సంబంధించిన రిహార్సల్‌ను గురువారం నిర్వహించనున్నారు. మరోసారి ఎంఆర్‌ఆర్‌ సమావేశం నిర్వహించాక లాంచింగ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశమై ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నారు.

Updated Date - 2023-02-09T03:34:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising