ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mangli: సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి

ABN, First Publish Date - 2023-01-22T18:30:50+05:30

బళ్లారి (Ballari)లో సింగర్ మంగ్లీ (Mangli) కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. శనివారం రాత్రి బళ్లారిలోని మున్సిపల్ కళాశాల గ్రౌండ్‌లో ‘బళ్లారి ఉత్సవ్’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నాటక: బళ్లారి (Ballari)లో సింగర్ మంగ్లీ (Mangli) కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. శనివారం రాత్రి బళ్లారిలోని మున్సిపల్ కళాశాల గ్రౌండ్‌లో ‘బళ్లారి ఉత్సవ్’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంగ్లీ పాల్గోంది. ఈ కార్యక్రమంలో పాటలు కూడా పాడింది. కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా ఆమె కారుపై దాడి చేశారు. కన్నడ మాట్లాడలేదంటూ మంగ్లీ కారుపై దాడి చేసిన స్థానికులు చెబుతున్నారు. ఇటీవల చిక్కబళ్లాపూర్‌ (Chikkaballapur)లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంగ్లీ పాల్గొంది. అయితే స్థానిక భాషలో కాకుండా మంగ్లీ తెలుగులో ‘అందరూ బాగుండారా’ అని పలకరించింది. అదే వేదికను పంచుకున్న యాంకర్ అనుశ్రీ ఇక్కడ కన్నడవాళ్లు ఉన్నారు కాబట్టి కన్నడ కూడా మాట్లాడాలని సూచించింది. చిక్కబళ్లాపూర్‌ ఏపీలో సరిహద్దులో ఉంటుంది. అందువల్ల మోజార్టీగా అక్కడి ప్రజలు తెలుగులోనే మాట్లాడుకుంటారు. అందువల్లే ‘‘అనంతపురం ఇక్కడికి దగ్గర్లోనే ఉంది. అందరూ తెలుగు వస్తుంది’’ అనే ఉద్దేశంతోనే తెలుగులో చెప్పానని సంజాయితీ కూడా ఇచ్చింది. మంగ్లీ తెలుగులో మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా (Social media)లో వైరల్‌ అవుతున్నాయి. కొందరు మంగ్లీ తీరును తప్పుబడుతున్నారు.మంగ్లీ కన్నడ ఇండస్ట్రీకి వచ్చి రెండేళ్లయిందని ఆమెకు కన్నడం అర్థం కదా అని ప్రశ్నిస్తున్నారు. కర్నాటక (Karnataka)కు వచ్చి కన్నడలో మాట్లాడపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Updated Date - 2023-01-22T18:30:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising