ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సుప్రీం మార్గదర్శకాలు పాటించాల్సిందే

ABN, First Publish Date - 2023-11-29T04:03:17+05:30

కేసుల నమోదు విషయం లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాల్సిందేనని పోలీసుల కు హైకోర్టు తేల్చిచెప్పింది.

కేసుల నమోదుపై పోలీసులకు తేల్చిచెప్పిన హైకోర్టు

లలితకుమారి కేసు తీర్పు ప్రతిని పోలీసులకు పంపండి

తెలుగులోకి అనువాదం చేసిన కాపీని కూడా జత చేయండి

కేడర్‌ను చైతన్యవంతం చేయాలి: డీజీపీకి ధర్మాసనం ఆదేశం

అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): కేసుల నమోదు విషయం లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాల్సిందేనని పోలీసుల కు హైకోర్టు తేల్చిచెప్పింది. లలితకుమారి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ యూపీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిని పోలీసు అధికారులకు పంపించాలని డీజీపీని ఆదేశించింది. ఉత్తర్వులపై మరింత మెరుగైన అవగాహన కోసం తెలుగులోకి అనువాదం చేసిన తీర్పు ప్రతిని జత చేయాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సరైన స్ఫూర్తితో అమలు చేసేలా అన్ని స్థాయిల్లోని పోలీసు కేడర్‌ను చైతన్యవంతం చేయాలని ఆదేశించింది. ఫిర్యాదు అందిన తరువాత ప్రాథమిక విచారణ అవసరమని భావించి 24గంటల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోతే, ఫిర్యాదు ఏ దశలో ఉందో ఫిర్యాదుదారుకు తెలిపేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ఇటీవల తీర్పు ఇచ్చారు. తాము ఫిర్యాదు చేసినప్పటికీ విశాఖ మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేయలేదని పేర్కొంటూ సీతమ్మధారకు చెందిన కాజా రామారావు, మరొకరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఒకే అంశంతో ముడిపడి ఉన్న ఈ కేసులపై న్యాయమూర్తి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో నిర్ణయాన్ని వాయిదా వేసిన న్యాయమూర్తి ఇటీవల తీర్పు ఇచ్చారు. ‘కేసులు నమోదు చేసే విషయమై లలితకుమారి కేసులో సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలు ఇచ్చింది. కాగ్నిజిబుల్‌ నేరాలు చోటుచేసుకున్నప్పుడు ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా కేసులు నమోదు చేయవచ్చని అందులో పేర్కొంది. ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుంటే, జిల్లా ఎస్పీకి రాతపూర్వకంగా సమాచారం ఇవ్వొచ్చు. అప్పటికీ కేసు నమోదు చేయకపోతే కోర్టులో న్యాయాధికారికి ప్రైవేటు ఫిర్యాదు చేయవచ్చు’ అని న్యాయమూర్తి గుర్తుచేశారు. కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలంటూ రోజూ అనేక పిటిషన్లు తమ ముందు విచారణకు వస్తున్నట్లు గమనించామని పేర్కొన్నారు.

Updated Date - 2023-11-29T04:04:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising