ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముందస్తు బెయిల్‌పై ఉత్కంఠ

ABN, First Publish Date - 2023-05-25T03:02:34+05:30

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై గురువారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై గురువారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. వాస్తవానికి ఈ పిటిషన్‌పై విచారణ జూన్‌ 5వ తేదీకి వాయిదా పడింది. అవినాశ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. గురువారం హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారించాలని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ పిటిషన్‌ గురువారం జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది. తీర్పు ఎలా ఉంటుందోనని అవినాశ్‌రెడ్డి, ఆయన అనుచరులు, వైసీపీ కార్యకర్తలు టెన్షన్‌ పడుతున్నారు. నిర్ణయం ఎంపీకి ప్రతికూలంగా వస్తే సీబీఐ అరెస్టు చేయడం ఖాయమన్న ఉద్దేశంతో అడ్డుకోవడానికి గురువారం పెద్దఎత్తున కర్నూలుకు తరలిరావాలని కడప జిల్లా వైసీపీ కార్యకర్తలకు సందేశాలు పంపినట్లు సమాచారం.

Updated Date - 2023-05-25T03:02:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising