TarakaRatna: ఐసీయూలో తారకరత్న.. బయటికొచ్చిన ఫొటో.. చూస్తేనే గుండె తరుక్కుపోతోంది..!
ABN, First Publish Date - 2023-01-31T12:59:36+05:30
‘యువగళం’ (YuvaGalam) పాదయాత్రలో అస్వస్థతకు లోనైన నందమూరి తారకరత్న (Nandamuri TarakaRatna) ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉండటం శోచనీయం. ఆయన కోలుకోవాలని..
‘యువగళం’ (YuvaGalam) పాదయాత్రలో అస్వస్థతకు లోనైన నందమూరి తారకరత్న (Nandamuri TarakaRatna) ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉండటం శోచనీయం. ఆయన కోలుకోవాలని మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరూ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. తమ ప్రార్థనలు ఫలించి తారకరత్న క్షేమంగా గండం నుంచి బయటపడాలని తెలుగుదేశం (TDP) పార్టీ అభిమానులు, నందమూరి కుటుంబ (Nandamuri Family) శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు. బెంగళూరు నారాయణ హృదయాలయలో (Bangalore Narayana Hrudayalaya Hospital) తారకరత్నకు వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయి. బ్రెయిన్కు సంబంధించిన సిటీ స్కాన్ రిపోర్ట్ (TarakaRatna Health Reports) మంగళవారం వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. హాస్పిటల్‌లోని ఐసీయూలో తారకరత్న చికిత్స (TarakaRatna At ICU) పొందుతున్న ఫొటో (TarakaRatna Photo) ఒకటి వైరల్ అయింది. ఆ ఫొటోను చూసిన నందమూరి అభిమానులు తల్లడిల్లిపోయారు. ‘నిన్ను అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతోందన్నా.. త్వరగా కోలుకుని తిరిగిరా అన్నా’ అని ట్వీట్స్ చేస్తున్నారు. వెంటిలేటర్ సాయంతో తారకరత్నకు వైద్యం అందిస్తున్నట్లుగా ఆ ఫొటోతో స్పష్టమైంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది.
రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా నెటిజన్లు తారకరత్న క్షేమంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తుండటం హర్షించతగిన పరిణామం. పవన్ బాబాయ్ అని ఆప్యాయంగా పిలిచే తారకరత్న సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా హాస్పిటల్ నుంచి వీలైనంత త్వరలో డిశ్చార్జ్ కావాలని మెజార్టీ పవన్ అభిమానులు ట్వీట్లు పెట్టారు. మరికొందరు పవన్ ఫ్యాన్స్ అయితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బెంగళూరు వెళ్లి తారకరత్నను చూసేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. జనసేన పార్టీ ఇప్పటికే తారకరత్న ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ కూడా చేసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కూడా తాజాగా తారకరత్న ఆరోగ్యంపై ట్వీట్ చేశారు. ‘సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నారాయణ హృదయాలయ హాస్పిటల్ వైద్యులు జనవరి 30, సాయంత్రం 6 గంటలకు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. నందమూరి తారకరత్న వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు బులిటెన్‌లో వెల్లడించారు. తారకరత్నకు ఎక్మో సపోర్ట్‌తో వైద్యం అందిస్తున్నట్లుగా కొన్ని మీడియా ఛానల్స్‌లో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టత ఇచ్చారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు వచ్చినా ఆయన కుటుంబానికి, మీడియాకు సమాచారం అందిస్తామని.. ఈలోపు ఎలాంటి నిరాధార వార్తలు ప్రచారం చేయవద్దని కోరారు.
Updated Date - 2023-01-31T13:19:48+05:30 IST