TarakaRatna : తారకరత్న తాజా హెల్త్ బులెటిన్ విడుదల.. డాక్టర్లు ఈసారి ఏం చెప్పారంటే..
ABN, First Publish Date - 2023-01-30T19:46:20+05:30
బెంగళూరు నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నకు..
బెంగళూరు : బెంగళూరు నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నకు (Nandamuri Tarakartna) కీలక పరీక్షల తర్వాత హెల్త్ బులెటిన్ (Health Bulletin) రిలీజ్ చేశారు డాక్టర్లు (Doctors). తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉందని చెప్పారు. ప్రస్తుతం ఐసీయూలో తారకరత్నకు వెంటిలేటర్ (Ventilator) సపోర్టుతో చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులకు (Family Members) ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నామని డాక్టర్లు బులెటిన్‌లో వివరించారు. ఎక్మో సపోర్ట్ (ECMO) పెట్టలేదని మరోసారి స్పష్టం చేశారు వైద్యులు. ఈ బులెటిన్‌తో నందమూరి సభ్యుల్లో మరింత ఆందోళన పెరిగింది. తారకరత్న త్వరగా కోలుకోవాలని నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రార్థిస్తున్నారు.
బాబాయ్ ఏం చెప్పారంటే..!
అంతకుముందు తారకరత్న (Nandamuri Tarakaratna) ఆరోగ్య పరిస్థితిపై (Health Condition) ఆయన బాబాయ్.. నందమూరి రామకృష్ణ(Nandamuri Ramakrishna) స్పందించారు. ఆయన ఆరోగ్యం (Health) నిన్న, మొన్నటితో పోలిస్తే కాస్త మెరుగుపడిందని (Betterment) రామకృష్ణ తెలిపారు. అవయవాలన్నీ (Body Parts) చికిత్సకు స్పందిస్తున్నాయని చెప్పారు. అయితే ఇంకా వెంటిలేటర్‌పైనే (Ventilator) ఉన్నారన్నారు. తారకత్నకు ఎక్మో (ECMO) పెట్టారన్న వార్తలపై రామకృష్ణ స్పందించారు. ఎక్మో పెట్టలేదని.. అవన్నీ అవాస్తవాలేనని రామకృష్ణ కొట్టిపారేశారు. రామకృష్ణ చెప్పిన ఈ ఒక్క మాట నందమూరి (Nandamuri), నారా ఫ్యామిలీ (Nara Family), అభిమానులు (Fans), టీడీపీ కార్యకర్తలకు (TDP Activists) కాస్త ఉపశమనం (Relief) కలిగించేదని చెప్పుకోవచ్చు.
అన్నీ తానై..!
కాగా.. ప్రస్తుతం ఇద్దరు న్యూరో సర్జన్లు సహా 10మంది వైద్యులు తారకరత్న ఆరోగ్యాన్ని నిత్యం (Daily) పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు.. ఆస్పత్రి వద్ద సందర్శకుల తాకిడి పెరగడంతో బెంగళూరు పోలీసులు (Bangalore Police) భద్రత కట్టుదిట్టం చేశారు. మొదటి రోజు నుంచీ ఎమ్మెల్యే బాలయ్య ఆస్పత్రిలోనే ఉండి ఎప్పుటికప్పుడు తారకరత్న ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. తారకరత్నకు అన్నీ తానై బాలయ్యే చూసుకుంటున్నారని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఆస్పత్రిలోనే తారకరత్న సతీమణి, పిల్లలు ఉన్నారు. ఆస్పత్రికి వచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు (Cine, Political celebrities) తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శించి.. ధైర్యం చెబుతున్నారు.
Updated Date - 2023-01-30T20:38:53+05:30 IST