ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP Leaders : వివేకా హత్య కేసును డైవర్ట్ చేసేందుకే సునీతపై పోస్టర్లు

ABN, First Publish Date - 2023-04-25T13:23:21+05:30

ప్రొద్దుటూరులో మాజీ మంత్రి వైఎస్ వివేకా కూతురు సునీత పోస్టర్లు వెలిశాయి. ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ టీడీపీ నేతల ఫోటోలతో కలిపి ఆమె ఫోటోను సైతం వేసి ప్రధాన కూడళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప : ప్రొద్దుటూరులో మాజీ మంత్రి వైఎస్ వివేకా కూతురు సునీత పోస్టర్లు వెలిశాయి. ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ టీడీపీ నేతల ఫోటోలతో కలిపి ఆమె ఫోటోను సైతం వేసి ప్రధాన కూడళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు. సునీత వాల్ పోస్టర్లపై టీడీపీ నేతలు స్పందించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు వైసీపీ నాయకులు ప్రొద్దుటూరును ఎంచుకున్నారని స్థానిక టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. వివేకా హత్య కేసును డైవర్ట్ చేసేందుకే వైఎస్ సునీత రాజకీయ ప్రవేశమంటూ వైసీపీ శ్రేణులు పోస్టర్లు అంటించారని విమర్శించారు. సునీత పోస్టర్లు ఎవరు అంటిం చారో గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ఆ పోస్టర్లో టీడీపీ నేతల ఫొటోస్ వేశారని.. వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-04-25T13:23:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising