ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP: టీడీపీకి దక్కిన అండమాన్‌ కార్పొరేషన్‌ గిరి

ABN, First Publish Date - 2023-03-15T04:07:00+05:30

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఒక కీలకమైన పదవి తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఈ దీవుల ప్రధాన కేంద్రమైన పోర్ట్‌ బ్లెయిర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చైౖర్మన్‌ పదవి టీడీపీకి చెందిన మహిళా కార్పొరేటర్‌ సెల్విని వరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బీజేపీ, టీడీపీ కూటమిలో భాగంగా అధికార మార్పిడి

కూటమి విజయంపై నడ్డా హర్షం

అమరావతి, మార్చి 14(ఆంధ్రజ్యోతి): అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఒక కీలకమైన పదవి తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఈ దీవుల ప్రధాన కేంద్రమైన పోర్ట్‌ బ్లెయిర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చైౖర్మన్‌ పదవి టీడీపీకి చెందిన మహిళా కార్పొరేటర్‌ సెల్విని వరించింది. బీజేపీ, టీడీపీ కూటమి ఒప్పందంలో భాగంగా ఈ పదవి ఆమెకు దక్కింది. మూడేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాలేదు. బీజేపీ, టీడీపీ కలిసి కార్పొరేషన్‌ను దక్కించుకొన్నాయి. ఒప్పందం ప్రకారం మొదటి మూడేళ్లూ బీజేపీకి చైర్మన్‌ పదవి లభించింది. తర్వాతి రెండేళ్లు టీడీపీకి ఇచ్చారు. అక్కడ గెలిచిన టీడీపీ ఇద్దరు కార్పొరేటర్లకు చెరొక ఏడాది చైర్మన్‌ పదవి ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించింది. మహిళా కార్పొరేటర్‌ సెల్వికి మొదటి అవకాశం వచ్చింది. ఆమె గతంలో ఉప చైర్మన్‌గా పనిచేశారు. మంగళవారం జరిగిన ఎన్నికలో టీడీపీ అభ్యర్థికి 14 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థికి పది ఓట్లు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల బయట టీడీపీకి ఇంత కీలకమైన పదవి లభించడం ఇదే ప్రఽథమం. అండమాన్‌ దీవులకు టీడీపీ అధ్యక్షునిగా ఉన్న మాణిక్యాలరావు యాదవ్‌, పార్టీ ఇన్‌చార్జి మాధవ నాయుడు అక్కడి బీజేపీ నేతలతో చర్చించి ఈ ఎన్నిక సాఫీగా జరిగేలా చూశారు. కాగా, పోర్ట్‌ బ్లెయిర్‌ ఎన్నికలో బీజేపీ, టీడీపీ కూటమి విజయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన దీనిపై ఒక ట్వీట్‌ చేశారు. ‘పోర్ట్‌ బ్లెయిర్‌ మునిసిపల్‌ కౌన్సిల్‌ ఎన్నికలో స్ఫూర్తిదాయక విజయం సాధించిన కూటమికి అభినందనలు. పోర్ట్‌ బ్లెయిర్‌ ప్రజల కోసం మీరు పడిన శ్రమ, చూపించిన అంకిత భావం ఫలించాయి. ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పాలన, దూరదృష్టిపై ఉన్న నమ్మకానికి ఈ ఎన్నిక ఒక గుర్తింపు’ అని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2023-03-15T04:07:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising