ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మహిళలపై వలంటీర్ల వల!

ABN, First Publish Date - 2023-07-10T03:15:46+05:30

‘ఏపీలో కనపడకుండా పోయిన 29 వేల మందికిపైగా మహిళల గురించి కేంద్ర నిఘా వర్గం ఏం చెప్పిందో తెలుసా? రాష్ట్రంలో మిస్‌ అయిన ఆడవాళ్ల వెనుక వలంటీర్లు ఉన్నారని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలో 29 వేల మంది అతివలు అదృశ్యం

ఆడపిల్లల అపహరణ వెనుక వైసీపీ పెద్దలు

ట్రాప్‌ చేసి మాయం చేస్తున్నారు

కేంద్ర నిఘా వర్గమే నాకు చెప్పింది

చెత్త పన్ను వేసే జగన్‌కు,

దారి దోపిడీ దొంగకు తేడా లేదు

నా జోలికి వస్తే డొక్క చించుతా

చావుకు సిద్ధపడే రాజకీయాల్లోకొచ్చా

సీఎం లక్షల కోట్లు మింగాడు

పేదలకు కేటాయించిన లక్షల కోట్లేవీ?

ఇవన్నీ అడిగితే నన్ను బూతులు తిట్టాలా?

ముఖ్యమంత్రిపై పవన్‌కల్యాణ్‌ ధ్వజం

ఏలూరు, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ‘ఏపీలో కనపడకుండా పోయిన 29 వేల మందికిపైగా మహిళల గురించి కేంద్ర నిఘా వర్గం ఏం చెప్పిందో తెలుసా? రాష్ట్రంలో మిస్‌ అయిన ఆడవాళ్ల వెనుక వలంటీర్లు ఉన్నారని..! ఒంటరిగా, భర్త లేని, బాధల్లో ఉన్న మహిళలను వెతికి పట్టుకోవడం, ట్రాప్‌ చేయడం, బయటకు తీసుకెళ్లడం, మాయం చేయడం ఇదే వలంటీర్ల పని’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఈ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ వెనుక వైసీపీకి చెందిన పెద్ద పెద్ద నాయకులు ఉన్నారని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర నిఘా వర్గం తనకు చెప్పి, ప్రజలకు తెలియజేయమందని

చెప్పారు. ఏలూరులో ఆదివారం జరిగిన వారాహి రెండో దశ విజయ యాత్రను ప్రారంభించిన ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు. చెత్త పన్ను వేసే జగన్‌కు, దారి దోపిడీ దొంగకు తేడా లేదన్నారు. సీఎం పదవికి గౌరవమిస్తానని.. కానీ విలువలు లేని జగన్‌కు ఇవ్వనని స్పష్టం చేశారు. ‘నా జోలికి వస్తే డొక్క చించుతా. చావుకు సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చా.. ఎప్పుడు ఎవరు నన్ను చంపుతారో నాకే తెలీదని ప్రతీ రోజూ నా తల్లి, భార్యకు చెప్పి బయటకు వస్తున్నా, నాకు భయం లేదు. విద్య, వైద్యం, ఉపాధి కోసం నా ప్రాణం పోయే వరకు అండగా ఉంటా’ అని జగన్‌పై నిప్పులు చెరిగారు. బుగ్గలు నిమిరి, కౌగిలించుకునే నాయకుడిని నమ్మవద్దని ప్రజలకు పిలుపిచ్చారు. ఇంకా ఏమన్నారంటే..

మిగతా 15 వేల మంది ఆచూకీ ఎక్కడ?

వైసీపీ అధికారం చేపట్టిన నాలుగేళ్ల పాలనలో దాదాపు 29 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారు. వారిలో 14 వేల మంది ఇళ్లకు చేరారు, మిగిలిన 15 వేల మంది మహిళల ఆచూకీ ఎక్కడ? ఇంత మంది కనిపించకుండా పోతే ఈ డీజీపీలు, పోలీసులు ఒక్క రివ్యూ మీటింగ్‌ కూడా ఎందుకు పెట్టలేదు? ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? అదే మీ ఇళ్లల్లో ఆడవాళ్లు కనిపించకుండా పోతే ఇలాగే వదిలేస్తారా? గెలుపోటములతో సంబంధం లేకుండా నా నేల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటా. ఎప్పుడైనా చావడానికి సిద్ధమే. దాడి చేయాలని చూస్తే చొక్కా గుండీ విప్పి మరీ ఎదురెళ్తా. పోలీసులను కొట్టిన విలువలు లేని వ్యక్తివి నువ్వు జగన్‌! అలాంటి నిన్ను ఏమైనా అనాలన్నా ఛీ వెధవా అనిపిస్తుంది.

కాగ్‌ ప్రశ్నలకు సమాధానమెక్కడ?

నిధుల ఖర్చుపై కాగ్‌ 2020-21 ఆర్థిక సంవత్సరానికి జగన్‌ ప్రభుత్వానికి ఎన్నో ప్రశ్నలు వేసింది. అందులో ముఖ్యంగా రూ.1.18 లక్షల కోట్లను ఆఫ్‌-బడ్జెట్‌ బారోయింగ్‌ కింద ఎలా ఖర్చు పెట్టావని అడిగితే సమాధాన ం లేదు. ఈ సభ సాక్షిగా సీఎంను అడుగుతున్నాను.. నువ్వు కాగ్‌కు ఎందుకు జవాబు చెప్పట్లేదు? ఏపీ స్టేట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ కింద రూ.22,504 కోట్లు అప్పు తీసుకున్నావ్‌.. ఏపీఆర్‌డీసీ కింద 4,754 కోట్లు అప్పు తీసుకున్నావ్‌.. ఎక్కడా బడ్జెట్లో చూపించలేదు. డీజీపీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రతి మూడు ప్రమాదాలకు ఒక మనిషి చనిపోతున్నాడు. జగన్‌.. నువ్వు రాష్ట్రంలో రోడ్లన్నీ వేసి ఛస్తే ఎవరెలా పోతున్నారో చెప్పొచ్చు. రోడ్డు కూడా వేయకుండా ఆ డబ్బులన్నీ ఏంచేశావ్‌? నిజంగా రాష్ట్రాభివృద్ధి కోసమే అప్పు తీసుకుని ఉంటే ఎవరికి ఖర్చు పెట్టావ్‌? ఖర్చులకు బిల్లులు లేవని కాగ్‌ చెప్పింది. నాలుగేళ్లు గడిచిపోయింది కదా! మరి వీటన్నింటికీ ఇంకెప్పుడు సమాధానాలు చెబుతావ్‌? నీ ప్రభుత్వం మారగానే నిన్ను ఊరు.. ఊరు, వాడ వాడ వెంటాడతాం.


నీచంగా మాట్లాడుతున్నారు..

నేను రాజకీయ విలువల గురించి మాట్లాడుతుంటే నా ఇంటి ఆడబిడ్డలు, తల్లి, పిల్లల గురించి ఈ వైసీపీ నాయకులు నీచంగా మాట్లాడుతున్నారు. నేటి దాకా జగన్‌ను గౌరవంగా మాట్లాడాను. కానీ ఇవాళ ఏలూరులో మొదలైన ఈ రెండో దశ యాత్ర నుంచి, అంబేడ్కర్‌ సాక్షిగా ఈ ముఖ్యమంత్రిని నువ్వు అనే పిలుస్తాను. ఇంత మంది యువత, ప్రజలు అమాయకంగా నీవైపు చూస్తుంటే.. అరాచక పాలన చేస్తున్నావు. మద్యపాన నిషేధం పేరు చెప్పి అధికారంలోకి వచ్చి.. ఇవాళ అదే మద్యాన్ని అమ్ముకుంటూ డబ్బు సంపాదిస్తున్నావ్‌. దేశం మొత్తం డిజిటల్‌ పేమెంట్లు, ఫోన్‌పే, గూగుల్‌ పే జరుగుతుంటే.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మాత్రం నగదు ఇస్తేనే బాటిల్‌ ఇస్తారట! చివరకు చెత్త తొలగించే సిబ్బందిపైనా చెత్త పన్ను వేస్తున్న చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్‌.

రాష్ట్ర బడ్జెట్‌ పేరు చెప్పి లక్షల కోట్లు మింగిన జగన్‌.. కాగ్‌కు ఎందుకు బిల్లులు చూపించడంలేదు. పేదలకు కేటాయించిన లక్షల కోట్లు ఎక్కడున్నాయి? ఇవన్నీ అడిగితే నన్ను బూతులు తిట్టాలా సన్నాసుల్లారా!

నాలుగేళ్లుగా జనంలోకి వచ్చి వాళ్ల కష్టం అడిగావా? కనీసం ఒక ప్రెస్‌ మీట్‌ పెట్టావా? ఎవరైనా ప్రశ్నిస్తారని భయమేసి పరదాల మాటున మహారాణిలా తిరుగుతున్నావ్‌! నువ్వా నన్ను తిట్టేది!

- పవన్‌ కల్యాణ్‌

Updated Date - 2023-07-10T03:15:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising