ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మహాసేన రాజేశ్‌పై రెండు కేసులు

ABN, First Publish Date - 2023-11-10T04:33:09+05:30

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఎస్సీ విభాగం స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు మహాసేన రాజేశ్‌పై టీవీ9 ప్రతినిధుల ఫిర్యాదు మేరకు విజయవాడలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నెల 1వ తేదీన సూర్యారావుపేట పోలీ్‌సస్టేషన్‌లో 368 నంబరు ఎఫ్‌ఐఆర్‌

విజయవాడలో టీవీ9 ప్రతినిధుల ఫిర్యాదు

వారిపై తాడేపల్లిలో టీడీపీ కంప్లయింట్‌

విజయవాడ (వన్‌టౌన్‌)/తాడేపల్లి, నవంబరు 9: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఎస్సీ విభాగం స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు మహాసేన రాజేశ్‌పై టీవీ9 ప్రతినిధుల ఫిర్యాదు మేరకు విజయవాడలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నెల 1వ తేదీన సూర్యారావుపేట పోలీ్‌సస్టేషన్‌లో 368 నంబరు ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం 120 (బీ), 153, 153-ఏ, 505 (2) ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీవీ-9 ఆఫీసులో కంపెనీ సెక్రటరీ ఎ.భాస్కరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. అలాగే టీవీ-9 అసోసియేట్‌ ఎడిటర్‌ దేవీ నాగవల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 354-ఏ (4), 509, 153, 120 (బి), 153-ఏ, 505 (2) ఐపీసీ సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు. సరిపిల్ల రాజేశ్‌ అలియాస్‌ లంక రాజేశ్‌ అలియాస్‌ మహాసేన రాజేశ్‌ తమ సంస్థ ప్రతిష్ఠను దిగజార్చడానికి, ఉద్యోగుల వ్యక్తిగత గుర్తింపులను దెబ్బతీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని భాస్కరరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నాగవల్లి ఇచ్చిన ఫిర్యాదులో.. తమపై రాజేశ్‌ దాడులకు కుట్ర పన్నుతున్నారని, వ్యక్తిత్వ హననం చేస్తున్నారని, మానసిక వేదనకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులు రాజేశ్‌పై వేర్వేరుగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినప్పటికీ ఆ కేసులు బహిర్గతం కాకుండా జాగ్రత్త పడ్డారు. గోప్యంగా ఉంచడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా టీవీ9 చానల్‌ ప్రతినిధులపై తాడేపల్లి పోలీస్‌ ేస్టషన్లో గురువారం టీడీపీ ఎస్సీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు దొప్పులపూడి జ్యోతి బస్సు, పలువురు నాయకులు ఫిర్యాదు చేశారు. మహా సేన రాజేశ్‌పై చానల్‌ ప్రతినిధులు అక్రమ కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. దళితుడైన రాజేశ్‌ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించడమే కాకుండా ఆయన జీవించే హక్కును, వాక్‌ స్వాతంత్ర్యాన్ని హరించి వేేస విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. మీడియా యాజమాన్యంపైనా, ప్రతినిధులపైనా ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989 ప్రకారం కేసు నమోదు చేయాలని కోరారు.

Updated Date - 2023-11-10T04:33:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising