కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అదుపు తప్పిన కారు

ABN, First Publish Date - 2023-12-10T00:39:17+05:30

జాతీయ రహదారిపై షీలానగర్‌- విమానాశ్రయం మధ్య శనివారం ఉదయం ఓ కారు అదుపు తప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

అదుపు తప్పిన కారు
నుజ్జునుజ్జయిన కారు ముందు భాగం

చిరు వ్యాపారికి తీవ్ర గాయాలు

అక్కిరెడ్డిపాలెం, డిసెంబరు 9: జాతీయ రహదారిపై షీలానగర్‌- విమానాశ్రయం మధ్య శనివారం ఉదయం ఓ కారు అదుపు తప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నాతయ్యపాలేనికి చెందిన జి.కనకరాజు పీసు మిఠాయి తయారిచేసి దుకాణాలకు విక్రయింస్తుంటాడు, శనివారం ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై పీసు మిఠాయి బ్యాగులు పెట్టుకుని ఎన్‌ఏడీ వైపు వెళుతూ షీలానగర్‌ మొదటి వంతెన దాటాక మూత్ర విసర్జన కోసం రోడ్డు పక్కన ఆగాడు. అదే సమయంలో గాజువాక నుంచి నగరంలోకి వస్తున్న కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న ఇనుప రెయిలింగ్‌ను బలంగా ఢీకొని మూత్ర విసర్జనకు ఆగిన కనకరాజుతో పాటు ద్విచక్ర వాహనాన్ని, ఢీకొంది. దీంతో కనకరాజు రెయిలింగ్‌ పైనుంచి ఎగిరి రోడ్డు పక్కనున్న పొదల్లో పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. కారు ముందు భాగంగా నుజ్జు నుజ్జయింది. కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్‌ మద్యం సేవించడం వల్ల కానీ సెల్‌ ఫోన్‌ మాట్లాడుతూ ఉండడం వల్ల గానీ ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులతో పాటు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-12-10T00:39:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising