ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2023-07-31T00:00:08+05:30

భార్య మాటలకు నొచ్చుకుని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆదివారం సాయంత్రం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దువ్వాడ సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

కూర్మన్నపాలెం, జూలై 30: భార్య మాటలకు నొచ్చుకుని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆదివారం సాయంత్రం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దువ్వాడ సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 88వ వార్డు పరిధి మంగళపాలెం సమీపంలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో ఓదూరి చిట్టిబాబు (43) భార్య నూకరత్నం, కుమారుడుతో కలిసి నివాసం ఉంటున్నాడు. తన బావమరిది కూడా తమతో పాటే వుండడం ఇష్టం లేని చిట్టిబాబు తరచూ భార్యతో, బావమరదితో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం బావ, బావమరిదిలిద్దరూ మద్యం సేవించి గొడవకు దిగారు. దీంతో మీ తమ్ముడిని ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పాలని భార్య నూకరత్నంపై చిట్టిబాబు ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె అంగీకరించపోగా మా తమ్ముడు ఎక్కడకీ వెళ్లడు, ఇక్కడే వుంటాడు.. నీకు మాతో వుండాలనిపిస్తే వుండు.. లేకపోతే ఇంటి నుంచి వెళ్లిపో అంటూ కోపంగా భర్తకు బదులిచ్చింది. తన మాటకు విలువ లేనప్పుడు ఎందుకు బతకడమని మనస్తాపంతో తమ ఇంటికి సమీపంలో వున్న చెట్టుకు చిట్టిబాబు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు దువ్వాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు చిట్టిబాబు ఆటోనగర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు.

Updated Date - 2023-07-31T00:00:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising