ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అంతటా కాంతితో క్రాంతి

ABN, First Publish Date - 2023-10-08T01:08:32+05:30

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా శనివారం రాత్రి జిల్లా అంతటా కాంతితో క్రాంతి కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రాత్రి 7 గంటల నుంచి ఐదు నిమిషాల పాటు ఇళ్లల్లో లైట్లు ఆపి వేసి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. అలాగే టీడీపీ శ్రేణులు, అభిమానులు వీధుల్లో కొవ్వొత్తులు, కాగడాలు, సెల్‌ఫోన్‌ లైట్ల కాంతితో కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో వాహనచోదకులు తమ వాహనాల లైట్లు బ్లింక్‌ చేసి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.

కె.కోటపాడు మండలం కింతాడ గ్రామంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్న పీవీజీ కుమార్‌, తదితరులు

- చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం

- రాత్రి 7 గంటల నుంచి ఐదు నిమిషాల పాటు లైట్లు ఆపి కొవ్వొత్తులతో నిరసన

- వీధుల్లో కాగడాలు, సెల్‌ఫోన్‌ లైట్ల వెలుతురులో ప్రదర్శన

- టీడీపీ శ్రేణులు, అభిమానులతో పాటు స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు

(అనకాపల్లి- న్యూస్‌ నెట్‌వర్క్‌)

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా శనివారం రాత్రి జిల్లా అంతటా కాంతితో క్రాంతి కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రాత్రి 7 గంటల నుంచి ఐదు నిమిషాల పాటు ఇళ్లల్లో లైట్లు ఆపి వేసి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. అలాగే టీడీపీ శ్రేణులు, అభిమానులు వీధుల్లో కొవ్వొత్తులు, కాగడాలు, సెల్‌ఫోన్‌ లైట్ల కాంతితో కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో వాహనచోదకులు తమ వాహనాల లైట్లు బ్లింక్‌ చేసి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు ఇంటి వద్ద కొవ్వొత్తులతో కాంతితో క్రాంతి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అనకాపల్లి నెహ్రూచౌక్‌ కూడలిలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి, ఆకాశదీపాలను వదిలారు. నర్సీపట్నంలో ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో కౌన్సిలర్‌ జనిమిరెడ్డి మధుబాబు ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి, ఆకాశ దీపాలను వదిలారు. చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి తాతయ్యబాబు ఆధ్వర్యంలో బుచ్చెయ్యపేట మండలం దిబ్బిడిలో కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. చోడవరంలో తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మళ్లునాయుడు ఆధ్వర్యంలో వెలమ వీధిలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడు మండలం కింతాడ గ్రామంలో ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ ఆధ్వర్యంలో ఇళ్లలో లైట్‌లు ఆఫ్‌ చేసి బయటకు వచ్చి కొవ్వొత్తులు, కాగడాలతో ప్రదర్శన చేశారు. పాయకరావుపేటలో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఎలమంచిలిలో టీడీపీ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షుడు బొద్దపు శ్రీను ఆధ్వర్యంలో కొవ్వొత్తులు, కాగడాలతో నిరసన తెలిపారు. పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం మొగలిపురంలో పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆధ్వర్యంలో మహిళలు కొవ్వొత్తులు, సెల్‌ఫోన్‌ లైట్లతో నిరసన తెలిపారు. పరవాడ మండలం వెన్నెలపాలెంలో బండారు నివాసం వద్ద టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు, పార్టీ శ్రేణులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.

కొనసాగిన దీక్షలు

చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా శనివారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. ఎలమంచిలి పట్టణంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్‌బాబు మౌన దీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, పట్టణ అధ్యక్షుడు నానాజి, జనసేన పట్టణ అధ్యక్షుడు బి.శ్రీను పాల్గొన్నారు. మాడుగులలో టీడీపీ మండల అధ్యక్షుడు అద్దిపల్లి జగ్గారావు ఆధ్వర్యంలో మండల నాయకులు నిరసన దీక్షలు చేశారు. చీడికాడ మండలం బి.సింగవరంలో కాశీవిశ్వేశ్వరాలయంలో చంద్రబాబు త్వరగా విడుదల కావాలని టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2023-10-08T01:08:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising