ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిడ్నీ రాకెట్‌.. నిరుపేదలే టార్గెట్‌!

ABN, First Publish Date - 2023-04-28T03:39:00+05:30

విశాఖలో కిడ్నీల వ్యాపారం గుట్టుగా సాగిపోతోంది. ఆర్థిక అవసరాలున్న వారిని లక్ష్యంగా చేసుకుని పలు ఆస్పత్రులు కిడ్నీల దందా సాగిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖలో కిడ్నీ దందా.. బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి...

అనుమతులే లేవని తేలడంతో శ్రీతిరుమల ఆస్పత్రి సీజ్‌

విశాఖపట్నం, పెందుర్తి, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): విశాఖలో కిడ్నీల వ్యాపారం గుట్టుగా సాగిపోతోంది. ఆర్థిక అవసరాలున్న వారిని లక్ష్యంగా చేసుకుని పలు ఆస్పత్రులు కిడ్నీల దందా సాగిస్తున్నాయి. నగర పరిధిలోని పలు ఆస్పత్రులు.. ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తులకు అనధికారికంగా కిడ్నీ ఏర్పాటు చేస్తున్నాయి. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు లక్షలాది రూపాయలు ఇచ్చేందుకు ముందుకొస్తుండగా, ఆయా ఆస్పత్రులు నిరుపేదలకు కొంత మొత్తాన్ని చెల్లించి వారి నుంచి కిడ్నీలు తీసుకుని అవసరమైన వారికి అమరుస్తున్నాయి. అయితే, ఆర్థిక లావాదేవీలు బెడిసికొడుతుండడంతో ఈ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో నగర పరిధిలోని శ్రద్ధ ఆస్పత్రిపై ఆరోపణలు రాగా, తాజాగా పెందుర్తిలోని శ్రీతిరుమల ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్‌ బయటపడింది. కిడ్నీ ఇచ్చిన వ్యక్తికి ముందస్తు ఒప్పందం ప్రకారం ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుడు బుధవారం పోలీసులకు ఫిర్యాదుచేశాడు.

నిబంధనలకు విరుద్ధంగా..

ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో కుటుంబ సభ్యులు ఎవరైనా కిడ్నీఇస్తే ఆ మేరకు తహసీల్దార్‌, పోలీసుల నుంచి పత్రాలు తీసుకుని సమర్పించాల్సి ఉంటుంది. బయటి వ్యక్తి ఎవరైనా ముందుకొస్తే ఆర్థిక లావాదేవీలు లేవని నిర్ధారించడంతోపాటు ఆయన కుటుంబ సభ్యుల నుంచి (భార్య, పిల్లలు, తల్లిదండ్రులు) నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలి. అయితే, పెందుర్తిలో జరిగిన కిడ్నీ మార్పిడి వ్యవహారంలో ఈ నిబంధనలేవీ పాటించలేదు. గతంలో నగర పరిధిలోని శ్రద్ధ ఆస్పత్రిలో అడ్డగోలుగా కిడ్నీ మార్పిడి చేశారు. విశాఖలో అనేక ఆస్పత్రుల్లో ఈ తరహా వ్యవహారాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు, అవసరాలున్న వారిని గుర్తించి వారిని కిడ్నీ దానం చేసేలా ఒప్పించేందుకు అనేక మంది బ్రోకర్లు ఉన్నట్టు చెబుతున్నారు. దీనికోసం బ్రోకర్లకు రూ.లక్ష నుంచి రెండు లక్షల వరకు చెల్లిస్తుంటారు. కిడ్నీ కావాల్సిన వ్యక్తుల నుంచి ఆయా ఆస్పత్రులు రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వీటిలో కిడ్నీ ఇచ్చే వ్యక్తికి రూ.10 లక్షల లోపే చెల్లిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని ఆస్పత్రులు, ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసే వైద్యులు తీసుకుంటున్నారు.

ఆరోగ్యశాఖ అనుమతి లేకుండా..

తాజాగా మధురవాడ వాంబే కాలనీకి చెందిన కామరాజు అనే వ్యక్తి మధ్యవర్తిత్వం నిర్వహించి తన కిడ్నీ తీసుకున్నారని అదే ప్రాంతానికి చెందిన వినయ్‌కుమార్‌ అనే కారు డ్రైవర్‌ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెందుర్తిలోని శ్రీతిరుమల ఆస్పత్రిలో ఈ వ్యవహారం జరిగిందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఆ ఆస్పత్రిని ఆరోగ్యశాఖ అధికారులు గురువారం తనిఖీ చేశారు. ఈ క్రమంలో అసలు ఆ ఆస్పత్రికి ఆరోగ్య శాఖ అనుమతే లేదని తేల్చారు. దీంతో ప్రైవేటు క్లినికల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 8 ప్రకారం కలెక్టర్‌ అనుమతితో ఆరోగ్యశాఖ అధికారుల బృందం గురువారం సాయంత్రం ఈ ఆస్పత్రిని సీజ్‌ చేసింది.

బ్రెయిన్‌డెడ్‌ కేసులతోనూ వ్యాపారం!

విశాఖ నగరంలోని అనేక ఆస్పత్రుల్లో అవయవాల మార్పిడి పేరుతో వ్యాపారం జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని కొంతమంది లైవ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు పురిగొల్పుతుంటే, మరికొన్ని ఆస్పత్రులు బ్రెయిన్‌డెడ్‌ కేసులతో ఈతరహా వ్యాపారం చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-04-28T03:39:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising