పొలం బడి ద్వారా ఉత్తమ వ్యవసాయ పద్ధతులు
ABN, First Publish Date - 2023-07-01T00:44:44+05:30
రైతులు ఉత్తమ వ్యవసాయ పద్ధతులు పాటించి, తద్వారా నాణ్యమైన దిగుబడులు పొందేందుకు ప్రతివారం అనకాపల్లి జిల్లా వనరులు కేంద్రం ద్వారా పొలం బడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా వ్యవసాయాధికారి బి.మోహన్‌రావు తెలిపారు.
ప్రతి వారం అనకాపల్లిలో నిర్వహణ
కె.కోటపాడు, జూన్ 30 : రైతులు ఉత్తమ వ్యవసాయ పద్ధతులు పాటించి, తద్వారా నాణ్యమైన దిగుబడులు పొందేందుకు ప్రతివారం అనకాపల్లి జిల్లా వనరులు కేంద్రం ద్వారా పొలం బడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా వ్యవసాయాధికారి బి.మోహన్‌రావు తెలిపారు. మండలంలోని వారాడ గ్రామంలో శుక్రవారం రైతులకు ఏర్పా టైన అవగాహన సదస్సులో మాట్లాడారు. ఇరవై హెక్టార్ల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా నుంచి వారాడ గ్రామాన్ని క్లస్టర్ పొలంబడి కార్యక్రమానికి ఎంపిక చేసినట్టు చెప్పారు. వేసవి దుక్కులు, నాణ్యమైన విత్తనం ఎంపిక, విత్తనశుద్ధి, మట్టి పరీక్షలు, నీటి పరీక్షలు తదితర ఉత్తమ పద్ధతులపై రైతులను చైతన్య పరచనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ శ్రీధర్, ఏవోలు విజేత, తులసీమణి, రిసోర్స్‌పర్సన్ చిరంజీవి, ఏవో సోమశేఖర్, గోరుపోతు వెంకటరావు, బొద్దు దొరస్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-01T00:44:44+05:30 IST