ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చేదుగా చెరకు సాగు!

ABN, First Publish Date - 2023-08-03T01:21:25+05:30

జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గిపోతున్నది. పెట్టుబడులు, ఖర్చులు పెరిగిపోవడం, మద్దతు ధర గిట్టుబాటు కాకపోవడం, చెరకు డబ్బుల చెల్లింపుల్లో షుగర్‌ ఫ్యాక్టరీలు తీవ్ర జాప్యం చేయడం, ప్రభుత్వ సహకారం లేకపోవడం, జిల్లాలో మూడు సహకార చక్కెర ఫ్యాక్టరీల మూతపడడం వంటి కారణాలతో చెరకు సాగుపై రైతులు విసిగిపోయారు. దీంతో వేరే పంటలకు మళ్లడంతో చెరకు సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. రెండు దశాబ్దాల కిందట ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల్లో సుమారు లక్ష ఎకరాల్లో చెరకు సాగు చేసేవారు. తరువాత క్రమేపీ తగ్గుతూ వచ్చి ఈ ఏడాది అనకాపల్లి జిల్లాలో 13,299 ఎకరాలకు పడిపోయింది.

: చెరకు తోట

పెరిగిపోతున్న పెట్టుబడులు

గొర్రె తోక చందంగా మద్దతు ధర

చెరకు బకాయిల చెల్లింపుల్లో షుగర్‌ ఫ్యాక్టరీలు తీవ్ర జాప్యం

కొరవడిన ప్రభుత్వ సహకారం

వైసీపీ హయాంలో మూడు షుగర్‌ ఫ్యాక్టరీలు మూత

జిల్లాలో భారీగా తగ్గిపోయిన చెరకు విస్తీర్ణం

2020-21 సీజన్‌లో 48,605 ఎకరాలు

ఈ ఏడాది 13,299 ఎకరాలకే పరిమితం

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గిపోతున్నది. పెట్టుబడులు, ఖర్చులు పెరిగిపోవడం, మద్దతు ధర గిట్టుబాటు కాకపోవడం, చెరకు డబ్బుల చెల్లింపుల్లో షుగర్‌ ఫ్యాక్టరీలు తీవ్ర జాప్యం చేయడం, ప్రభుత్వ సహకారం లేకపోవడం, జిల్లాలో మూడు సహకార చక్కెర ఫ్యాక్టరీల మూతపడడం వంటి కారణాలతో చెరకు సాగుపై రైతులు విసిగిపోయారు. దీంతో వేరే పంటలకు మళ్లడంతో చెరకు సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. రెండు దశాబ్దాల కిందట ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల్లో సుమారు లక్ష ఎకరాల్లో చెరకు సాగు చేసేవారు. తరువాత క్రమేపీ తగ్గుతూ వచ్చి ఈ ఏడాది అనకాపల్లి జిల్లాలో 13,299 ఎకరాలకు పడిపోయింది.

వైసీపీ హయాంలో మూడు ఫ్యాక్టరీలు మూత

జిల్లాలో తుమ్మపాల (అనకాపల్లి), ఏటికొప్పాక, పాయక రావుపేట(తాండవ), గోవాడ (చోడవరం)లో సహకార రంగంలో షుగర్‌ ఫ్యాక్టరీలు వున్నాయి. నాలుగున్నరేళ్ల క్రితం వరకు ఈ ఫ్యాక్టరీలు నిక్షేపంగా నడిచాయి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి ఏడాదే తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ మూతపడింది. 2021-22 క్రషింగ్‌ సీజన్‌ నుంచి తాండవ, ఏటికొప్పాక ఫ్యాక్టరీలకు తాళాలు వేశారు. ఇక గోవాడ ఫ్యాక్టరీ ఒక్కటే పడుతూ లేస్తూ నడుస్తున్నది. మూడు ఫ్యాక్టరీలు మూత పడడానికి.. ప్రభుత్వ సహకారం లేకపోవడం, పంచదార ఉత్పత్తి వ్యయం కన్నా మార్కెట్‌లో ధరలు తక్కువ వుండడం, పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడం, చెరకు సరఫరా చేసిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించలేకపోవడం ప్రధాన కారణాలు. కాగా మూడేళ్ల క్రితం.. అంటే 2020-21 సీజన్‌లో మూడు ఫ్యాక్టరీలు క్రషింగ్‌ జరిపిన సమయంలో జిల్లాలో 48,605 ఎకరాల్లో చెరకు సాగు అయ్యింది. తరువాత రెండు ఫ్యాక్టరీలు మూత పడడంతో వీటి పరిధిలో చెరకు సాగు 90 శాతం తగ్గిపోయింది. మరోవైపు గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలో కూడా వివిధ కారణాల వల్ల పలువురు రైతులు చెరకు బదులు వేరే పంటలు వేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల గణాంకాల ప్రకారం జూలై చివరినాటికి జిల్లాలో 13,299 ఎకరాల్లో మాత్రమే చెరకు సాగులో వుంది. ఈ నెలాఖరుకు మరికొంత విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయినప్పటికీ 15 వేల ఎకరాలకు మించే పరిస్థితులు లేవు. గతంలో నాలుగైదు లక్షల టన్నుల చెరకు క్రషింగ్‌ చేసిన గోవాడ ఫ్యాక్టరీ గత ఐదేళ్ల నుంచి తగ్గుతూ వస్తున్నది. గత సీజన్‌లో 2.21 లక్షల టన్నులకు పరిమితమైంది. చెరకు బకాయిల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం, కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కన్నా ఫ్యాక్టరీ చెల్లించే ధర తక్కువ వుండడంతో రైతులు చెరకు సాగుకు స్వస్తి చెబుతున్నారు. ఈ పరిస్థితి రానున్న కాలంలో గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తుందని చక్కెర రంగం నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చెరకు తీసేసి వరి వేస్తున్నాను

- బొద్దపు శ్రీరామమూర్తి, ఒంపోలు, మునగపాక మండలం

నాకు రెండెకరాల భూమి ఉంది. దశాబ్ద కాలంగా చెరకు సాగు చేస్తున్నాను. కానీ ఏటేటా సాగు ఖర్చులు పెరుగుతున్నాయే తప్ప ఆ స్థాయిలో చెరకు మద్దతు ధర పెరగడంలేదు. పైగా తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ మూతపడింది. బెల్లం తయారీ కూడా గిట్టుబాటు కావడంలేదు. మొత్తం మీద పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. దీంతో రెండేళ్ల నుంచి చెరకు సాగు మానేశాను. వరి పంట పండిస్తున్నారు.

చెరకు బకాయిల చెల్లింపుల్లో తీవ్రజాప్యం

బంటు రాజు, కొవ్వూరు, రోలుగుంట మండలం

నేను నాలుగు ఎకరాల్లో చెరకు సాగుచేసేవాడిని. గోవాడ ఫ్యాక్టరీకు చెరకు తోలేవాడిని. కానీ యాజమాన్యం బకాయిలు చెల్లింపుల్లో తీవ్రజాప్యం చేస్తున్నది. దీంతో తరువాత సీజన్‌లో పంటకు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సి వస్తున్నది. ఈ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా వుండడంతో చెరకు సాగు మానేశాను. దీనికిబదులు వరి, ఆగాకర, అపరాల పంటలను సాగు చేస్తున్నాను.

Updated Date - 2023-08-03T01:21:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising