బహుజనుల అభివృద్ధే బీఎస్‌పీ లక్ష్యం
ABN, First Publish Date - 2023-01-31T00:19:50+05:30
బహుజనుల అభివృద్ధి కోసం రాష్ట్రంలో రాజ్యాధికార చైతన్యయాత్ర చేపడుతున్నట్టు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పక్కా పరంజ్యోతి అన్నారు.
కె.కోటపాడు, జనవరి 30: బహుజనుల అభివృద్ధి కోసం రాష్ట్రంలో రాజ్యాధికార చైతన్యయాత్ర చేపడుతున్నట్టు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పక్కా పరంజ్యోతి అన్నారు. సోమవారం కె.కోటపాడులో బహుజనుల రాజ్యాధికార చైతన్యయాత్రలో భాగంగా స్థానిక రెల్లిపేటలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పరంజ్యోతి మాట్లాడుతూ.. రాష్ట్రం లో బహుజనులు ఎన్నో సమస్యలతో ఉంటే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో బహుజనుల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లకే రాజారావు, కరణం తిరుపతిరావు, ఆర్‌జె మల్లికల, కాకి ప్రసాద్, గుర్రే చిన్నారావు, బోని కృష్ణ, పి. కనకమహలక్ష్మి, సుభాషిణి, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-31T00:19:51+05:30 IST