ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌ సిద్ధమయ్యేనా?

ABN, First Publish Date - 2023-09-25T01:01:37+05:30

మండల కేంద్రంలో నిర్మిస్తున్న కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌ ఈ ఏడాది సీజన్‌ నాటికి అందుబాటులోకి వచ్చేనా? అనే సందేహాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఏడాది కిందట ప్రారంభమైన కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌ పనులు ఇప్పటికి 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఎకో పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టరుకు ఏడాది గడిచినా ఒక్క బిల్లు కూడా ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి.

కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌ బోర్డు

- ఈ సీజన్‌కు అందుబాటులోకి రావడం అనుమానమే..

- 60 శాతం పనులు పూర్తయినా కాంట్రాక్టరుకు ఏడాదిగా బిల్లులు మంజూరు చేయని ప్రభుత్వం

- పనులకు బ్రేక్‌

గూడెంకొత్తవీధి, సెప్టెంబరు 24: మండల కేంద్రంలో నిర్మిస్తున్న కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌ ఈ ఏడాది సీజన్‌ నాటికి అందుబాటులోకి వచ్చేనా? అనే సందేహాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఏడాది కిందట ప్రారంభమైన కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌ పనులు ఇప్పటికి 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఎకో పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టరుకు ఏడాది గడిచినా ఒక్క బిల్లు కూడా ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి.

మరో నెల రోజుల్లో కాఫీ దిగుబడులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎకో పల్పింగ్‌ యూనిట్‌ ఈ ఏడాది అందుబాటులోకి వస్తుందో? లేదోనన్న అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీ రైతులు సుమారు అరవై ఏళ్లుగా సంప్రదాయేతర పంటగా కాఫీని సాగు చేస్తున్నారు. కాఫీ సాగుకు ఐటీడీఏ ప్రోత్సహించడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం కాఫీ ఆదివాసీల ప్రధాన వాణిజ్య పంటగా మారిపోయింది. కాఫీ గింజలను మెజారిటీ రైతులు చెర్రీగా విక్రయించుకుంటున్నారు. అతి తక్కువ మంది రైతులు బేబీ పల్పర్లు ద్వారా పార్చిమెంట్‌ తయారు చేసుకుంటున్నారు. దీంతో ఆదివాసీ రైతులు అంతర్జాతీయ కాఫీ ధరలు పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యయంలో 2018 డిసెంబరులో గత తెలుగుదేశం ప్రభుత్వం చింతపల్లి కేంద్రంగా ‘కాఫీ పైల్‌ ప్రాజెక్టు’ను ప్రారంభించింది. ప్రభుత్వం ట్రైకార్‌ ద్వారా రూ.3.5 కోట్ల నిధులను కేటాయించింది. కాఫీ గింజలకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించి, అంతర్జాతీయ ధరలు అందించాలనే ఉద్దేశంతో ‘ది విశాఖ ఏజెన్సీ గిరిజన కాఫీ ఉత్పత్తిదారుల సరస్పర సహాయక సంఘం(మ్యాక్స్‌)ను ఏర్పాటు చేసింది. గతలో పనిచేసిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు డీకే బాలాజీ, డాక్టర్‌ వెంకటేశర్లు, రోణంకి గోపాలక్రిష్ణలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చింతపల్లిలో మ్యాక్స్‌కి అనుబంధంగా సుమారు రూ.3 కోట్ల ట్రైకార్‌, ఐటీడీఏ నిధులతో కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌ నిర్మించారు. ఈ పల్పింగ్‌ యూనిట్‌ 2020-21 నుంచి అందుబాటులోకి వచ్చింది. నాలుగేళ్లలో చింతపల్లి ఎకో పల్పింగ్‌ యూనిట్‌ రైతులకు అంతర్జాతీయ ధరలు అందించడంలో ప్రధాన భూమిక పోషించింది. ఈ క్రమంలో గత ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలక్రిష్ణ చింతపల్లి, జి.మాడుగల మండలాల్లోనూ రూ.40 లక్షల నిధులు ఎకో పల్పింగ్‌ యూనిట్‌ భవనాలకు మంజూరు చేశారు. 2022 ఆగస్టులో రెండు మండలాల్లోనూ ఎకో పల్పింగ్‌ యూనిట్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌.. జి.మాడుగుల, చింతపల్లి ఎకో పల్పింగ్‌ యూనిట్లు సీజన్‌నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అయితే నిధుల లేమి కారణంగా పనులు మందగించాయి.

నిధులులేక నిలిచిపోయిన నిర్మాణాలు

గూడెంకొత్తవీధి కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణాలు నిధులు లేక నిలిచిపోయాయి. గత ఏడాది ఆగస్టు నుంచి నేటి వరకు కాంట్రాక్టరు సుమారు రూ.25 లక్షలు ఖర్చు చేశారు. దీనికి సంబంధించి ఒక్క బిల్లు కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదు. ప్రస్తుతం ఎకో పల్పింగ్‌ యూనిట్‌కి విద్యుత్‌ సదుపాయం కల్పించేందుకు ఈపీడీసీఎల్‌కి రూ.8 లక్షలు చెల్లించాల్సి వున్నది. విద్యుత్‌ కనెక్షన్‌ పొందేందుకు చెల్లించాల్సిన నిధులు లేకపోవడంతో కాంట్రాక్టరు పనులు నిలిపివేశారు. ఎకో పల్పింగ్‌ యూనిట్‌కి విద్యుత్‌ సదుపాయం అందుబాటులోకి వస్తేనే తప్ప భవనం పైకప్పు నిర్మాణాలు సాధ్యంకాదని ఇంజనీరింగ్‌ అధికారులు అంటున్నారు.

సీజన్‌కి అందుబాటులోకి వచ్చేనా?

అక్టోబరు నెలాఖరు నుంచి కాఫీ దిగుబడులు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి వరకు గిరిజన ప్రాంతంలో కాఫీ మార్కెటింగ్‌ సీజన్‌ ఉంటుంది. ఎకో పల్పింగ్‌ యూనిట్‌ భవనం నిర్మాణాలు 60శాతం పూర్తయ్యాయి. నిరంతరాయంగా పనులు కొనసాగించినా భవనం నిర్మాణాలు పూర్తి చేసేందుకు మరో రెండు నెలల సమయం పడుతుంది. భవనం నిర్మాణాలు పూర్తి చేసిన పిదప కాఫీ పల్పింగ్‌కు అవసరమైన రూ.కోటి విలువైన యంత్రాలు కొనుగోలు చేయాలి. యంత్రాలు వెనువెంటనే దిగుమతి చేసుకున్నప్పటికి ఇన్‌స్టాల్‌ చేసేందుకు నెల రోజుల సమయం పడుతుంది. ఈ పనులన్నీ శరవేగంగా జరగాలంటే ప్రభుత్వం అవసరమైన నిధులను వెంటనే సమకూర్చాల్సిన అవసరం ఉన్నది. భవన నిర్మాణానికి సంబంధించిన నిధులను ఏడాది కాలంగా చెల్లించని ప్రభుత్వం పల్పింగ్‌ యూనిట్‌కి అవసరమైన నిధులన్నీ కేవలం నెల రోజుల్లో సమకూర్చడం కష్టసాధ్యమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఎకో పల్పింగ్‌ యూనిట్‌ ఈ సీజన్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు.

----------

పనులు వెంటనే ప్రారంభిస్తాం

ఎకో పల్పింగ్‌ యూనిట్‌కు విద్యుత్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ప్రత్యేక నిధులు కేటాయించారు. వారం రోజుల్లో ఈ నిధులు విడుదలకానున్నాయి. నిధులు విడుదలకాగానే విద్యుత్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేస్తాం. విద్యుత్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చిన వెంటనే పైకప్పు నిర్మాణాలు పూర్తి చేస్తాం. నిర్మాణ సామగ్రి సిద్ధంగా ఉంది.

- రఘునాథరావు నాయుడు, ఏఈఈ, గిరిజన సంక్షేమశాఖ, గూడెంకొత్తవీధి

Updated Date - 2023-09-25T01:01:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising