ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జలాశయాల నిర్మాణం చంద్రబాబుకే సాధ్యం

ABN, First Publish Date - 2023-06-27T00:56:08+05:30

‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో టీడీపీ నాయకులు చేపట్టిన బస్సు యాత్ర సోమవారం నియోజకవర్గంలోని నాలుగు మం డలాల్లో ఉత్సాహభరితంగా సాగింది. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులంతా జేజేలు కొడుతూ నాయకులు ఉన్న బస్సుకు ఎదురెళ్లి స్వాగతాలు పలికారు.

కె.కోటపాడు మండలం కూండ్రపువానిపాలెంలో మాట్లాడుతున్న టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన నాయకులు

మాడుగుల రూరల్‌, జూన్‌ 26 : ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో టీడీపీ నాయకులు చేపట్టిన బస్సు యాత్ర సోమవారం నియోజకవర్గంలోని నాలుగు మం డలాల్లో ఉత్సాహభరితంగా సాగింది. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులంతా జేజేలు కొడుతూ నాయకులు ఉన్న బస్సుకు ఎదురెళ్లి స్వాగతాలు పలికారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాజీఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు గవిరెడ్డి రామానాయుడు, గిడ్డి ఈశ్వరి, పార్టీ నియో జకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌, టీడీపీ నాయకులు పైలా ప్రసాదరావు, మండల నాయకుడు పుప్పాల అప్పల రాజులు మాడుగుల బస్టాండ్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంత రం మోదకొండమ్మను దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌ పుప్పాల అప్పలరాజు, కమిటీ సభ్యులు మెమెం టోలతో సత్కరించారు. అక్కడి నుంచి బయల్దేరి ఎం. కోడూరు మీదుగా తాటిపర్తి తారకరామా జలా శయా నికి చేరుకుని అక్కడ సెల్ఫీచాలెంజ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బండారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం సాగునీటి వనరులపై శీతకన్ను వేయడంతో పాటు వ్యవసాయ రంగాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో 85 ప్రాజెక్టుల కోసం రూ.62వేల కోట్లు ఖర్చుపెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. తారకరామా జలాశయం పూర్తి చేసేందుకు రూ.14 కోట్లు ఖర్చు అవసరమని, ఆమాత్రం నిధులను డిప్యుటీ సీఎం బూడి ముత్యాలనాయుడు తీసుకు రాలేకపోయారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమని, ఈ నియోజకవర్గంలో అసం పూర్తిగా ఉన్న జలాశయాలను చంద్రబాబు నాయుడు హయాంలోనే పూర్తవుతాయని చెప్పారు. ఈ కార్య క్రమంలో పార్టీ నాయకులు అద్దిపల్లి జగ్గారావు, ఉం డూరు దేముడు, సన్యాసిరావు, రంజిత్‌వర్మ, కాశీబాబు, సూరిబాబు వర్మ, రాంబాబు, నానాజీ తదితరులతో పాటు భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు.

‘జగన్‌ పాలనలో రాష్ట్రం సర్వనాశనం’

కె.కోటపాడు : జగన్‌కు ఒక్కఛాన్స్‌ ఇచ్చినందుకు రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో టీడీపీ నాయకులు చేపట్టిన బస్సు యాత్ర సోమవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో కె.కోటపాడు మండలం కింతాడ పంచాయతీ కూండ్రపువానిపాలెం చేరుకుంది. పల్లెనిద్రలో భాగంగా తొలుత బండారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందన్నారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను జగన్‌ తీవ్రంగా మోసగించారన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ వైసీపీకి ఇవే చివరి ఎన్నికలన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, నియోజకవర్గం నాయకుడు పైలా ప్రసాదరావు, చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావులు జగన్‌ పాలన తీరుపై నిప్పులు చెరిగారు. నాయకులు కశిరెడ్డి అప్పలనాయుడు, కన్నూరు సూర్యనారాయణ, బత్తి వెంకటరమణ, పోతల రమణమ్మ, సత్యవతి, రొంగలి మహేష్‌, రామునాయుడు, రాము పాల్గొన్నారు.

Updated Date - 2023-06-27T00:56:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising