కొనసాగిన ఎండ తీవ్రత
ABN, First Publish Date - 2023-06-18T01:22:09+05:30
వాయువ్య భారతం నుంచి వీచిన పొడిగాలులకు శనివారం నగరంతోపాటు పరిసర ప్రాంతాలు ఉడికిపోయాయి.
పద్మనాభంలో 42.5 డిగ్రీలు నమోదు
విశాఖపట్నం, జూన్ 17 (ఆంధ్రజ్యోతి):
వాయువ్య భారతం నుంచి వీచిన పొడిగాలులకు శనివారం నగరంతోపాటు పరిసర ప్రాంతాలు ఉడికిపోయాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు తీవ్ర వడగాడ్పులు వీచాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అత్యధికంగా పద్మనాభంలో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా ఆనందపురంలో 41.3, గాజువాక, విశాఖ రూరల్‌లో 41.2, పెందుర్తి, విశాఖ అర్బన్‌లో 41.1, పెదగంట్యాడలో 41, ఎయిర్‌పోర్టులో 40.4 డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు ఉత్తర కోస్తాలో తీవ్ర వడగాడ్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
Updated Date - 2023-06-18T01:22:09+05:30 IST