ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పర్యాటకుల సందడి

ABN, First Publish Date - 2023-12-09T23:42:08+05:30

మన్యంలోని సందర్శనీయ ప్రాంతాలకు పర్యాటకులు శనివారం పోటెత్తారు. పాడేరు మండలంలోని వంజంగిహిల్స్‌ను అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. తుఫాన్‌ కారణంగా గత వారం వాతావరణం అనుకూలించకపోవడంతో పర్యాటకులు తీవ్ర నిరాశ చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాతావరణం ఎంతో అనుకూలంగా ఉండడంతో శనివారం అధిక సంఖ్యలో సందర్శకులు వంజంగి హిల్స్‌ను సందర్శించారు.

వంజంగి హిల్స్‌ మంచు మేఘాల వద్ద పర్యాటకులు

మన్యంలోని సందర్శనీయ ప్రాంతాలు రద్దీ

పాడేరు, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): మన్యంలోని సందర్శనీయ ప్రాంతాలకు పర్యాటకులు శనివారం పోటెత్తారు. పాడేరు మండలంలోని వంజంగిహిల్స్‌ను అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. తుఫాన్‌ కారణంగా గత వారం వాతావరణం అనుకూలించకపోవడంతో పర్యాటకులు తీవ్ర నిరాశ చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాతావరణం ఎంతో అనుకూలంగా ఉండడంతో శనివారం అధిక సంఖ్యలో సందర్శకులు వంజంగి హిల్స్‌ను సందర్శించారు. అలాగే పర్యాటకులను అలరించేలా సూర్యోదయం, మంచు మేఘాలు దర్శనమిచ్చాయి. దీంతో వంజంగి హిల్స్‌కు వచ్చిన సందర్శకులు ఆయా ప్రకృతి అందాలు తిలకిస్తూ పరశించిపోయారు.

లంబసింగిలో..

చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో లంబసింగి, చెరువులవేనం మంచు అందాలను వీక్షించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. శనివారం వేల సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లంబసింగి, చెరువులవేనం, తాజంగి జలాశయం పర్యాటకులతో కిటకిటలాడాయి. చెరువులవేనంలో మంచు సోయగాలను వీక్షించేందుకు పర్యాటకులు ఉదయం ఐదు గంటలకే చేరుకున్నారు. వ్యూపాయింట్‌ వద్ద ఎదురుగా ఆవిష్కృతమైన మంచు మేఘాలను ఆస్వాదిస్తూ పర్యాటకులు ఎంజాయ్‌ చేశారు. చెరువులవేనం మంచు అందాలను కెమెరాలో బంధించేందుకు పర్యాటకులు పోటీ పడ్డారు. కాగా చెరువులవేనం ప్రకృతి అందాలు సందర్శకులను అమితంగా అలరించాయి.

కొత్తపల్లి జలపాతం వద్ద..

జి.మాడుగుల: ప్రముఖ పర్యాటక ప్రాంతం కొత్తపల్లి జలపాతం వద్ద పర్యాటకుల సందడి కనిపించింది. ఇటీవల మిచౌంగ్‌ తుఫాన్‌ వల్ల జలపాతం వద్దకు పర్యాటకులకు ప్రవేశం కల్పించలేదు. అయితే గత రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పర్యాటకులను అనుమతిస్తున్నారు. దీంతో శనివారం అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు.

మాడగడ మేఘాల కొండ వద్ద..

అరకులోయ: అరకులోయకు సమీపంలో ఉన్న మాడగడ మేఘాల కొండ వద్దకు శనివారం అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. మంచు మేఘాలను చీల్చుకుంటూ వచ్చే సూర్యోదయాన్ని తిలకించేందుకు ఆసక్తి చూపారు. దీంతో వేకువజాము నుంచి ఇక్కడ సందడి నెలకొంది. మాడగడ హిల్స్‌ నుంచి కనుచూపు మేర ఉన్న భల్లుగుడ కొండ దిగువనున్న లోయ అంతా పాల సముద్రాన్ని తలపించేలా మంచు మేఘాలు పరుచుకుని ఉండడంతో పర్యాటకులు ఫొటోలు దిగుతూ సందడి చేశారు. అనంతరం అరకు గిరిజన మ్యూజియం, కళాగ్రామంలో గిరిజనుల ప్రతిమల వద్ద ఫొటోలు దిగుతూ, కొందరు బోటు షికారు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. అలాగే స్కైసైక్లింగ్‌, జిప్‌లైనర్‌ వంటి ఎడ్వంచర్స్‌లో పాల్గొన్నారు. అలాగే పద్మాపురం గార్డెన్‌లో కూడా పర్యాటకులు రద్దీ కనిపించింది. చాలా మంది టాయ్‌ ట్రైన్‌లో తిరుగుతూ గార్డెన్‌ను తిలకించారు. అరకులోయ, అనంతగిరి ఘాట్‌రోడ్డులోని కాఫీ తోటలు తిలకించి గాలికొండ వ్యూపాయింట్‌ వద్దకు చేరుకున్నారు. అనంతగిరి మండలంలోని బొర్రాగుహలును శనివారం సుమారు 4500 మంది పర్యాటకులు సందర్శించారు. ప్రవేశ రుసుము ద్వారా సుమారు రూ.3.7 లక్షల ఆదాయం వచ్చింది.

Updated Date - 2023-12-09T23:42:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising