ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తప్పని డోలీ మోత

ABN, First Publish Date - 2023-05-07T00:56:05+05:30

ఏజెన్సీలో సంపూర్ణమైన రోడ్డు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో మారుమూల ప్రాంత వాసులకు డోలీ మోతలు తప్పడం లేదు.

బాధితురాలు పెద్దమ్మిను డోలీలో మోస్తున్న బంధువులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిడుగుపాటు బాధితుల తరలింపులో కష్టాలు

పాడేరు, మే 6 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో సంపూర్ణమైన రోడ్డు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో మారుమూల ప్రాంత వాసులకు డోలీ మోతలు తప్పడం లేదు. మండలంలో శనివారం బడిమెల పంచాయతీ వల్లాయి గ్రామంలో ఓ ఇంటిపై పిడుగు పడింది. ఈ ఘటనలో మాదెల పెద్దమ్మికి తీవ్రంగా, మరో నలుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే వల్లాయి గ్రామం నుంచి బడిమెల వరకు సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంలో సుమారు మూడు కిలోమీటర్ల ఆమెను డోలీలో బడిమెల మోసుకుని వచ్చారు. అక్కడి నుంచి మరో వాహనంలో స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. తమ ప్రాంతానికి సంపూర్ణ రోడ్డు సదుపాయం లేకపోవడంతో నిత్యం ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్‌ సోమెలి లక్ష్మణరావు, పెద్దమ్మి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2023-05-07T00:56:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising