ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ జిల్లా ఆస్పత్రి సందర్శన

ABN, First Publish Date - 2023-04-03T00:59:59+05:30

స్థానిక జిల్లా ఆస్పత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ రామిరెడ్డి ఆదివారం సందర్శించారు. ఆస్పత్రిలో గిరిజనులకు అందుతున్న వైద్య సేవలు, అక్కడున్న సదుపాయాలపై ఆయన ఆరా తీశారు. అలాగే రోజువారీ ఓపీ, రిఫరల్‌ కేసులు, ప్రసూతి సేవలను అడిగి తెలుసుకున్నారు.

జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ల్యాబ్‌ను పరిశీలిస్తున్న హెల్త్‌ డైరెక్టర్‌ రామిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- రోగులకు వైద్య సేవలందుతున్న తీరుపై ఆరా

పాడేరు, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): స్థానిక జిల్లా ఆస్పత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ రామిరెడ్డి ఆదివారం సందర్శించారు. ఆస్పత్రిలో గిరిజనులకు అందుతున్న వైద్య సేవలు, అక్కడున్న సదుపాయాలపై ఆయన ఆరా తీశారు. అలాగే రోజువారీ ఓపీ, రిఫరల్‌ కేసులు, ప్రసూతి సేవలను అడిగి తెలుసుకున్నారు. సికిల్‌ సెల్‌ ఎనీమియా, తలసీమియా పరీక్షల నిర్వహణకు జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ల్యాబ్‌ను ఆయన పరిశీలించారు. వార్డులు, ప్రసూతి విభాగం, పోషకాహార పునరావాస కేంద్రాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది స్థితిగతులు, ఇతర సదుపాయాలపై హెల్త్‌ డైరెక్టర్‌ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సి.జమాల్‌ బాషా, జిల్లా మలేరియా అధికారి సాంబమూర్తి, జిల్లా వైద్య విధాన పరిషత్‌ సమన్వయకర్త శంకర్‌ప్రసాద్‌, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T00:59:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising