ప్రైవేటు వ్యక్తితో ఇంటింటా ఓటర్ల సర్వే
ABN, First Publish Date - 2023-08-28T00:22:13+05:30
లోపాలు లేని ఓటరు జాబితాలను రూపకల్పన చేయాలని, శిక్షణ పొందిన బూత్‌స్థాయి అధికారులే ఇంటింటికీ వెళ్లి పకడ్బందీగా సమగ్ర సర్వే చేపట్టాలని ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ మొక్కుబడిగా, ప్రైవేటు వ్యక్తిని నియమించుకుని సాగిందని మండలంలోని జె.నాయుడుపాలెం టీడీపీ నాయకుడు, యూనిట్ ఇన్‌చార్జి కేవీఎస్ నాయుడు ఆదివారం ఆరోపించారు.
జె.నాయుడుపాలెం పోలింగ్ బూత్ 42లో తూ.తూ.మంత్రంగా నిర్వహణ
ఇష్టారాజ్యంగా వ్యవహరించిన బీఎల్‌వో సంతోష్‌కుమార్
కలెక్టర్‌కు ఫిర్యాదు : టీడీపీ నాయకుడు కేవీఎస్ నాయుడు
రోలుగుంట, ఆగస్టు 27 : లోపాలు లేని ఓటరు జాబితాలను రూపకల్పన చేయాలని, శిక్షణ పొందిన బూత్‌స్థాయి అధికారులే ఇంటింటికీ వెళ్లి పకడ్బందీగా సమగ్ర సర్వే చేపట్టాలని ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ మొక్కుబడిగా, ప్రైవేటు వ్యక్తిని నియమించుకుని సాగిందని మండలంలోని జె.నాయుడుపాలెం టీడీపీ నాయకుడు, యూనిట్ ఇన్‌చార్జి కేవీఎస్ నాయుడు ఆదివారం ఆరోపించారు. తమ గ్రామంలో పోలింగ్ బూత్ నంబరు 42కు బీఎల్‌వోగా పంచాయతీ కార్యదర్శి సంతోష్‌కుమార్‌ను నియమించారన్నారు. కాగా మొదటి నుంచి కార్యదర్శి గ్రామంలో ఉన్న ప్రైవేటు వ్యక్తిని నియమించుకుని ఇంటింట సర్వే చేపట్టారని ఆరోపించారు. దీనివలన ఓటరు జాబితాలో చోటుచేసుకున్న లోపాలు సరిచేయకుండా మ.మ. అనిపించారన్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. 42 పోలింగ్ బూత్‌లో నూతన ఓటర్లు ఉన్నారని, అలాగే డబుల్ ఎంట్రీలు, చనిపోయిన వ్యక్తుల ఓటర్లు ఉన్నాయని వీటిపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టకుండానే సర్వేను చేశారని వాపోయారు. గత నెల 20నుంచి ఈ నెల 20వ తేదీ వరకు పంచాయతీ కార్యదర్శి ఒక్క ఇంటికీ వెళ్లలేదని ప్రైవేటు వ్యక్తి ద్వారా సర్వే చేపట్టారని పునరుద్ఘాటించారు. దీనిపై పలుమార్లు కార్యదర్శిని ప్రశ్నించినా మార్పు లేదన్నారు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, బీఎల్‌వోపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Updated Date - 2023-08-28T00:22:13+05:30 IST