పెందుర్తి రైల్వే స్టేషన్‌లో డీఆర్‌ఎం తనిఖీలు
ABN, First Publish Date - 2023-01-01T01:10:27+05:30
పెందుర్తి, కొత్తవలస రైల్వే స్టేషన్లతోపాటు ఆయా రైల్వే కాలనీలలో డీఆర్‌ఎం అనూప్‌కుమార్ శెత్పతీ శనివారం ఆకస్మిక తనిఖీలు చేశారు.
మౌలిక వసతులపై ఆరా
విశాఖపట్నం, డిసెంబరు 31: పెందుర్తి, కొత్తవలస రైల్వే స్టేషన్లతోపాటు ఆయా రైల్వే కాలనీలలో డీఆర్‌ఎం అనూప్‌కుమార్ శెత్పతీ శనివారం ఆకస్మిక తనిఖీలు చేశారు. పెందుర్తి, కొత్తవలస స్టేషన్లలో ప్రయాణికులకు సమకూర్చిన మౌలిక సదుపాయాలతోపాటు పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. అలాగే వెయిటింగ్ హాల్స్, పాదచారుల వంతెనలు, వాటర్ అవుట్ లెట్స్ తనిఖీ చేశారు. అనంతరం రైల్వే కాలనీలలో పర్యటించి మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు. రైల్వే కాలనీలో ఆక్రమణలు పరిశీలించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు పీకే.మహరాణా, జి.సునీల్‌కుమార్, ఏకే త్రిపాఠి, ప్రవీణ్ భాటియా తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-01T01:10:31+05:30 IST