ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివాసీల మంచి ప్రయత్నం

ABN, First Publish Date - 2023-05-07T23:14:07+05:30

తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ ఆదివాసీలు తిరిగారు. కలుషిత నీరు తాగి గ్రామస్థులు అనారోగ్యానికి గురవుతున్నారని తమ గోడు వెలిబుచ్చారు. కానీ ఎవరూ స్పందించలేదు.

గ్రావిటీ పైపు ఏర్పాటుకు తవ్వుతున్న ఆదివాసీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకులు, అధికారులు పట్టించుకోకపోయినా గ్రావిటీ పథకం నిర్మాణం

చందాలు వేసుకుని శ్రమదానంతో పనులు

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకి సరైన సమాధానం చెబుతామంటున్న చెక్కరాయి గిరిజనులు

గూడెంకొత్తవీధి, మే 7: తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ ఆదివాసీలు తిరిగారు. కలుషిత నీరు తాగి గ్రామస్థులు అనారోగ్యానికి గురవుతున్నారని తమ గోడు వెలిబుచ్చారు. కానీ ఎవరూ స్పందించలేదు. చేసేది లేక గ్రామస్థులంతా చందాలు వేసుకుని రూ.2 లక్షలు సమకూర్చుకున్నారు. మంచినీటి సరఫరాకు అవసరమైన పైపులు, కుళాయిలు కొనుగోలు చేసుకున్నారు. ప్రస్తుతం వారంతా శ్రమదానం చేస్తూ గ్రావిటీ పథకాన్ని నిర్మించుకుంటున్నారు. ఎన్నికల ముందు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మళ్లీ ఓట్లు అడిగేందుకు తమ గ్రామానికి వస్తే సరైన సమాధానం చెబుతామని గ్రామస్థులు అంటున్నారు.

గూడెంకొత్తవీధి మండలం చెక్కరాయి గ్రామంలో 60 గిరిజన కుటుంబాలు నివాసముంటున్నాయి. గ్రామంలో రక్షిత మంచి నీటి పథకం అందుబాటులో లేదు. గ్రామ శివారు పంట పొలాల వద్దనున్న ఊటగెడ్డ నుంచి నీళ్లను తెచ్చుకుంటున్నారు. వర్షం కురిస్తే ఈ ఊటగెడ్డ నీళ్లు కలుషితమైపోతున్నాయి. మరో ప్రత్యామ్నాయం లేక ఈ ఊటగెడ్డ నీళ్లనే ఆదివాసీలు ఉపయోగించడం వల్ల తరచూ వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో కొండవాగు ఉంది. ఏడాది పొడవునా నీటి ప్రవాహం ఉంటుంది. దీంతో ఈ నీటిని గ్రావిటీ పథకం ద్వారా గ్రామానికి తీసుకోరాగలిగితే తమ నీటి కష్టాలు తీరతాయని ఆదివాసీలు భావించారు. తమ గ్రామానికి గ్రావిటీ పథకం నిర్మించాలని వైసీపీ మండల నాయకులు, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, మండల స్థాయి అధికారులందరికి వినతి పత్రాలు అందజేశారు. మండల కేంద్రం అధికారుల వద్దకు కాళ్లు అరిగేలా తిరిగారు. కానీ ఫలితం లేకపోయింది.

శ్రమదానం, వ్యక్తిగత నిధులతో గ్రావిటీ నిర్మాణం

చెక్కరాయి గిరిజనులు ప్రతి కుటుంబం నుంచి వ్యక్తిగత చందాలు వేసుకుని రూ.2 లక్షల నిధులు సమకూర్చుకున్నారు. ఇంజనీరింగ్‌ అధికారుల సలహాలు, సూచనలు లేకపోయినా వారే గ్రావిటీ రక్షిత మంచినీటి పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కొండవాగు నుంచి గ్రామానికి నీటిని తరలించేందుకు అవసరమైన పైపులు కొనుగోలు చేసుకున్నారు. ఇంటింటికి నీటి సరఫరా చేసేందుకు కుళాయిలు కూడా కొనుగోలు చేశారు. ప్రస్తుతం శ్రమదానం చేస్తూ గ్రావిటీ పథకాన్ని నిర్మించుకుంటున్నారు. మరో రెండు రోజుల్లో ఆదివాసీలకు గ్రావిటీ పథకం అందుబాటులోకి రానున్నది.

Updated Date - 2023-05-07T23:14:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising