ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భారీ వర్షం

ABN, First Publish Date - 2023-10-01T01:12:38+05:30

మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల సేపు ఏకధాటిగా వర్షం పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎండ తీవ్రంగా కాసింది. ఆ తరువాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. ఈ వర్షం వరి చేనుకు మరింత అనుకూలమని రైతులు చెబుతున్నారు.

కె.కోటపాడు మండలం బొట్టవానిపాలెంలో వర్షం

- మధ్యాహ్నం వరకు ఎండ.. ఆ తరువాత వాన

కె.కోటపాడు, సెప్టెంబరు 30: మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల సేపు ఏకధాటిగా వర్షం పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎండ తీవ్రంగా కాసింది. ఆ తరువాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. ఈ వర్షం వరి చేనుకు మరింత అనుకూలమని రైతులు చెబుతున్నారు.

మాడుగులలో..

మాడుగుల రూరల్‌: మండంలోని పలు గ్రామాల్లో శనివారం వర్షం పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఆ తరువాత వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటుచేసుకుంది. ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది.

రాంబిల్లిలో..

రాంబిల్లి : మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై గాలులుతో కూడిన వర్షం కురిసింది.

రావికమతంలో..

రావికమతం: మండలంలో శనివారం కూడా వర్షం కురిసింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురవగా, శనివారం కూడా కొనసాగింది.

Updated Date - 2023-10-01T01:12:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising