ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోడి పందేలకు వేళాయే

ABN, First Publish Date - 2023-01-14T00:48:19+05:30

సంక్రాంతి పండగ వచ్చేసింది. దీంతోపాటే పల్లెల్లో తీర్థాలు, గ్రామ దేవతల ఉత్సవాలు మొదలవుతాయి. వచ్చే ఐదు నెలలపాటు గ్రామాల్లో జాతరే జాతర! ఎప్పటి మాదిరిగానే సంక్రాంతి కోడి పందేలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇవి ఒకటి రెండు రోజులతో ఆగవు. పల్లెల్లో తీర్థాలు కొనసాగినంత కాలం నిర్వహిస్తుంటారు. సంక్రాంతి బరిలోకి దిగేందుకు పందెంరాయుళ్లు ఇప్పటికే తమ కోడి పుంజులతో సిద్ధమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పండుగ తరువాత గ్రామాల్లో తీర్థాలు

జిల్లాలో ఐదు నెలలపాటు జాతరే జాతర!

పందేల కోసం ప్రత్యేకంగా పుంజుల పెంపకం

రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు అమ్మకం

చోడవరం, జనవరి 13:

సంక్రాంతి పండగ వచ్చేసింది. దీంతోపాటే పల్లెల్లో తీర్థాలు, గ్రామ దేవతల ఉత్సవాలు మొదలవుతాయి. వచ్చే ఐదు నెలలపాటు గ్రామాల్లో జాతరే జాతర! ఎప్పటి మాదిరిగానే సంక్రాంతి కోడి పందేలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇవి ఒకటి రెండు రోజులతో ఆగవు. పల్లెల్లో తీర్థాలు కొనసాగినంత కాలం నిర్వహిస్తుంటారు. సంక్రాంతి బరిలోకి దిగేందుకు పందెంరాయుళ్లు ఇప్పటికే తమ కోడి పుంజులతో సిద్ధమయ్యారు.

సంక్రాంతి పండుగకు గ్రామీణ ప్రాంతాల్లో కోడి పందేలు ప్రత్యేకం. పోలీసుల ఆంక్షలు ఎన్ని ఉన్నా ప్రజల ఉత్సాహం ముందు అవన్నీ బలాదూరే. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా కోడిపందేల కోసం నిర్వాహకులు అప్పుడే తమ తమ స్థాయిలో స్థానికంగా సన్నాహాలు చేసుకుంటున్నారు. పండగ రోజులు ఆపై తీర్థాలతో కోడిపందేలకు ఉండే ఆదరణను బట్టి, స్థానికంగా రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పందేలు సాగుతుంటాయి. కోళ్లకు కత్తులు కట్టకుండా నిర్వహించే డింకీ పందేలతో పాటు, కాళ్లకు కత్తి కట్టి దించే ... మిగతా 4వ పేజీలో

పందాలు కూడా ఎక్కువగా సాగుతుంటాయి. గ్రామాల్లో తీర్థాలు జరిగే పరిస్థితులు, పోలీసుల నిఘా, పోటీకి ఉండే సమయాన్ని బట్టి అప్పటికప్పుడు పందాల రాయుళ్లు ఈ రెండు రకాల్లో ఏదో ఒక రకం పందాలను నిర్వహిస్తూ వస్తున్నారు. సంక్రాంతి తరువాత తీర్థాలు మొదలు కానుండడంతో వచ్చే ఐదు నెలలు ఇటు పందెం రాయుళ్లు, అటు పందెం ఆడించే నిర్వాహకులు, పుంజులకు తర్ఫీదు ఇచ్చే వారు బిజీగా వుంటారు.

పందెం పుంజుల్లో రకాలు

పందెం పుంజులు, వాటి జాతులు, పెట్టే ఆహారం, శిక్షణ చాలా ప్రత్యేకంగా, ఆసక్తికరంగా వుంటాయి. కోడిపందాలలో ఏ పుంజులనుపడితే ఆ పుంజులను బరిలో దించరు. మామూలు కోడిపుంజుల కంటే పందెం కోడిపుంజులు కాస్త భిన్నంగా, దృఢంగా ఉంటాయి. శరీర దారుఢ్యం, ఆకారం,రంగు, ఎత్తు, తోక, ఈకలు.. ఇలా పలు గుణగణాలనుబట్టి చాలా రకాల కోడిపందెం పుంజులు ఉన్నాయి. బాగా ఎరుపు రంగులో ఉంటే దాన్ని డేగ, నీలం రంగులో ఉంటే కాకిగా పిలుస్తారు. పుంజు మెడ వద్ద పసుపు రంగులో ఉండి ఇతర భాగం తెల్లరంగులో ఉంటే తెల్లసవలగా, నల్లరంగులో ఉంటే నల్ల సవలగా గుర్తిస్తారు. బంగారు వర్ణంలో ఉండే కోడిని పచ్చకాకిగా పిలుస్తారు. కోడి ఈకలు డేగ ఈకల్లా ఉంటే వాటిని డేగగా పిలుస్తారు. కొన్నింటి తోకలు నెమలిని పోలి ఉంటాయి. వీటిలో ప్రధానమైనవి పచ్చకాకి, కాకి మైల రకాలు. కోడిపెట్ట ఆకారంలో ఉండే పుంజులను పెట్టమారి అంటారు. పందెం పుంజులు జాతి, వాటిరకం, పోరాట తత్వం ఆధారంగా ధరలు వుంటాయి.

పందెం పుంజుల పెంపకం

జిల్లాలో రావికమతం, మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు తదితర ప్రాంతాల్లో పందెం కోళ్లను పెంచే వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. వీటికి ఇచ్చే ఆహారంతోపాటు, శిక్షణ కూడా ప్రత్యేకంగా వుంటాయి. కొంతమంది బడాబాబులు ప్రత్యేకంగా నిపుణులను నియమించుకుని రోజుకి రూ.500 వేతనం, భోజనం, వసతి సమకూరుస్తుంటారు. కాగా పందెం పుంజులకు జీడిపప్పు, బాదం, పిస్తా, ఎండు ఖర్జూరం, కిస్‌మిస్‌, కోడిగుడ్డులో తెల్లసొనతో కలిపిన చిరుధాన్యాలను ఆహారంగా ఇస్తారు. కోడికి కొవ్వు పట్టకుండా, చురుగ్గా ఉండేలా దంపుడు బియ్యం, రాగులు, గంట్లు, మినపప్పు, శెగనపప్పు, గోధుమలు కలిపిన మిశ్రమ ఆహారం అదనం. నిత్యం రన్నింగ్‌, ఈత కొట్టించడం, గోరువెచ్చగా మసాజ్‌ చేయడం వంటివి క్రమం తప్పకుండా చేయిస్తారు. పందెం పుంజులను గోదావరి జిల్లాల పందెం రాయుళ్లకు, స్థానికంగా పందాలు నిర్వహించే వారికి విక్రయిస్తుంటారు. పుంజు రకం, వాటి సామర్థ్యాన్నిబట్టి ఒక్కొక్కటి 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతుంది.

గ్రామాల శివారుల్లో కోడి పందేలకు ఏర్పాట్లు

అనకాపల్లి రూరల్‌, జనవరి 13: సంక్రాంతి పండుగకు పది రోజుల ముందే కోడిపందేలు మొదలయ్యాయి. అనకాపల్లి మండలంలోని గోపాలపురం, పరవాడ మండలం ఏడుమెట్ల మర్రిపాలెం, ఎస్‌.రాయవరం మండలంలోని దార్లపూడిల్లో కోడి పందాలపై పోలీసులు దాడులు నిర్వహించడం దీనికి బలం చేకూరుస్తున్నది. ఇక అనకాపల్లితోపాటు కశింకోట, మునగపాక, పరవాడ, రాంబిల్లి పాయకరావుపేట, నర్సీపట్నం, సబ్బవరం మండలాల్లో సంక్రాంతి పండుగ సమయంలో కోడిపందేలు నిర్వహించడం ఆనవాయితీ. శనివారం నుంచి సంక్రాంతి సంబరాలు ప్రారంభం కానుండడంతో రానున్న నాలుగైదు రోజులు గ్రామాల్లో కోడిపందేలను జోరుగా నిర్వహించే అవకాశాలు వున్నాయి. గ్రామాలకు శివారులోని తోటలు, ఖాళీ స్థలాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ పోలీసులు దాడి చేస్తే సులువుగా తప్పించుకునే ప్రదేశాలను ఎంపిక చేశారు.

కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు

గ్రామాల్లో కోడిపందేలు, పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు. కోళ్లకు కత్తులు కట్టేవారిని ఇప్పటికే స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చాం. గ్రామాల్లో పోలీసు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారు. కోడిపందేల స్థావరాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక నిఘా పెడుతున్నాం.

- చిల్లా నరసింగరావు, అనకాపల్లి రూరల్‌ ఎస్‌ఐసంక్రాంతి బరిలో దిగేందుకు పుంజులు రెఢీ

Updated Date - 2023-01-14T00:48:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising