‘ఇరిగేషన్’ను గాలికొదిలేసిన జగన్ సర్కార్
ABN, First Publish Date - 2023-02-23T01:11:26+05:30
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. బుధవారం కశింకోట మండలం తాళ్లపాలెం సమీపంలోని బంగారయ్యపేట వద్ద ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశాన్ని, కె.కోటపాడు మండలం సూదివలసలో ప్రతిపాదిత భూదేవి రిజర్వాయర్ ప్రాంతాన్ని పార్టీ బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో విలేఖరులతో మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో ఏడు లక్షల ఎకరాకుల సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూపకల్పన చేసిన బాబు జగ్జీవన్‌రామ్ సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణం కలగా మిగిలిపోతుందేమోనని ఆవేదన వ్యక్తం చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపణ
14 ఏళ్లలో ఒక్క శాతం పనులు కూడా జరగని సుజల స్రవంతి
ప్రాజెక్టు నిర్మాణం కలగానే మిగిలిపోతుందేమోనని ఆవేదన
పార్టీ నేతలతో కలిసి తాళ్లపాలెం, సూదివలసల్లో పర్యటన
కశింకోట, ఫిబ్రవరి 22: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. బుధవారం కశింకోట మండలం తాళ్లపాలెం సమీపంలోని బంగారయ్యపేట వద్ద ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశాన్ని, కె.కోటపాడు మండలం సూదివలసలో ప్రతిపాదిత భూదేవి రిజర్వాయర్ ప్రాంతాన్ని పార్టీ బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో విలేఖరులతో మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో ఏడు లక్షల ఎకరాకుల సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూపకల్పన చేసిన బాబు జగ్జీవన్‌రామ్ సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణం కలగా మిగిలిపోతుందేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 2009లో తొలిసారి శంకుస్థాపన చేశారని, ఇప్పటికి 14 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఒక్క శాతం పనులు కూడా జరగలేదని అన్నారు. ఇదొక్కటే కాదని రాష్ట్రంలో వివిధ చిన్న తరహా ప్రాజెక్టులకు నిఽధులు కేటాయించకపోవడంతో అసంపూర్తిగా వున్నాయని రామకృష్ణ చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల, నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఓబులేసు, అక్కినేని వనజ, మధు, జి.ఈశ్వరయ్య, డేగ ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.విమల, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, జిల్లా సహాయ కార్యదర్శులు మాకిరెడ్డి రామునాయుడు, రాజాన దొరబాబు, జిల్లా కార్యవర్గసభ్యులు డీసీహెచ్ క్రాంతికుమార్, జి.గురుబాబు, రాజబాబు, బి.సుబ్బలక్ష్మి, ఆర్.అప్పలరాజు, చెరకు రైతు సంఘం ఉపాధ్యక్షుడు వేచలపు కాసుబాబు, కశింకోట మండల కార్యదర్శి సత్తిబాబు, కె.కోటపాడు మండల కార్యదర్శి గొర్ల దేవుడుబాబు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-23T01:11:27+05:30 IST