ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జల వనరుల శాఖ స్థలం ఆక్రమణ

ABN, First Publish Date - 2023-06-28T00:29:34+05:30

ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోంది. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జా అయిపోతోంది.

ఎలయ్య కాలువ రహదారిని కబ్జా చేసిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోంది. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జా అయిపోతోంది. గ్రామ శివారుల్లో కొండ పోరంబోకు స్థలాల్లో దర్జాగా పాగా వేస్తున్న కబ్జాదారులు ఇప్పుడు జల వనరుల పంట కాలువల సమీపంలో ఖాళీ స్థలాలను సైతం వదలడం లేదు. కలెక్టరు కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తుమ్మపాలలో కబ్జాదారులు ఇటీవల కాలంలో రెచ్చిపోతున్నారు. తుమ్మపాల గ్రామ సర్వే నంబర్‌ 467/3లో జల వనరుల శాఖకు చెందిన ఎల్లయ్య కాలువ గట్టుకు సమీపంలో స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. ఇదే సర్వే నంబరుకు ఆనుకొని వున్న జిరాయితీ స్థలాన్ని కొన్నేళ్ల కిందట 12 కుటుంబాలు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసుకొని ఇళ్లు నిర్మించుకొని ఉంటున్నారు. సర్వే నంబరు 467/3 జలవనరుల శాఖకు చెందిన స్థలం మీదుగానే ఆయా కుటుంబాలు రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు అర ఎకరా స్థలం యల్లయ్య కాలువ గట్టు మీదుగా రహదారి ఉంది. అయితే నివాసిత ప్రాంతానికి రహదారిగా వినియోగిస్తుండడంతో ఎవరి నుంచీ అభ్యంతరాలు రాలేదు. ఈ స్థ్థలం మార్కెట్‌ విలువ సుమారు రూ.50 లక్షలుపైగా ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా 12 కుటుంబాలు రహదారిగా వినియోగించుకుంటున్న జలవనరుల శాఖకు చెందిన స్థలంపై అధికార పార్టీకి చెందిన కొందరు చోటా నాయకులు కన్నేశారు. స్థలాన్ని ఎలాగైనా సొంతం చేసుకొనేందుకు రంగంలోకి దిగారు. నెల రోజుల కిందట రహదారికి అడ్డంగా రాళ్లు వేసి, సిమెంట్‌ స్తంభాలు వేసి ఫెన్సింగ్‌ వైరుతో రహదారిని కబ్జా చేశారు. దీనిపై స్థానికులు ప్రశ్నిస్తే.. మీకు నచ్చిన వారితో చెప్పుకోండి.. అంటూ బెదిరింపులకు దిగారు. ప్రస్తుతం నివాస ప్రాంతాలకు రహదారి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. తమ ఇళ్లకు ఎన్నో ఏళ్లుగా ఉన్న రహదారి కబ్జా కాకుండా చూడాలని వేడుకొంటున్నారు.

స్పందనలో ఫిర్యాదులు చేసినా..

అధికార పార్టీకి చెందిన నేతల దన్నుతో రెచ్చిపోతున్న కబ్జాదారులపై ఎన్నిసార్లు స్పందనలో ఫిర్యాదు చేసినా కనీసం స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జల వనరుల శాఖకు చెందిన ఎల్లయ్య కాలువ గట్టు రహదారి ఆక్రమణపై స్పందనలో ఈనెల 5 తేదీన, 19వ తేదీల్లో ఫిర్యాదులు చేశారు. సోమవారం మరోసారి ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జాదారులపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Updated Date - 2023-06-28T00:29:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising