11న జాతీయ లోక్‌ అదాలత్‌ విజయవంతం చేయండి

ABN, First Publish Date - 2023-02-04T00:47:34+05:30

ఈనెల 11న నిర్వహిస్తున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని స్థానిక 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎస్‌ఎం ఫణికుమార్‌ సూచించారు.

11న జాతీయ లోక్‌ అదాలత్‌ విజయవంతం చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు జిల్లా జడ్జి ఫణికుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చోడవరం, ఫిబ్రవరి 3: ఈనెల 11న నిర్వహిస్తున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని స్థానిక 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎస్‌ఎం ఫణికుమార్‌ సూచించారు. జాతీయ లోక్‌ అదాలత్‌పై కోర్టు పరిధిలోని చోడవరం, మాడుగుల నియోజకవర్గాలకు చెందిన పోలీస్‌, ఎక్జైజ్‌ శాఖలతోపాటు వివిధ విభాగాల అధికారులతో శుక్రవారం కోర్టు ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ లోక్‌ అదాలత్‌తో రాజీకి అవకాశం ఉన్న కేసులు వీలైనన్ని పరిష్కారం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.అరుణశ్రీ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పోతల ప్రకాశరావు, చోడవరం, కె.కోటపాడు, కొత్తకోట సర్కిల్‌ పోలీస్‌ స్టేషన్లకు చెందిన సీఐలు శ్రీనివాసరావు, తాతారావు, ఎస్‌ఐలు, ఎక్జైజ్‌, అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-04T00:47:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising