ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మురిపించిన ముత్యాల ముగ్గులు

ABN, First Publish Date - 2023-01-09T01:27:08+05:30

‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌ నిర్వహిస్తున్న టాటా టీ జెమిని ముత్యాల ముగ్గుల పోటీలు... గార్డెనింగ్‌ పార్టనర్‌ క్రాఫ్ట్‌ వారి పర్‌ఫెక్ట్‌.. ఫ్రాగ్రెన్స్‌ పార్టనర్‌ బెట్కో వారి అన్నమయ్య అగరవత్తులు... హెల్త్‌ పార్టనర్‌ అమృతబిందు... ఫ్యాషన్‌ పార్టనర్‌ డిగ్‌సెల్‌ మరియు సెల్సియా’ సారథ్యంలో పాడేరులోని మోదకొండమ్మ ఓపెన్‌ ఆడిటోరియంలో స్థానిక స్పాన్సర్‌ అక్షర ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నిర్వహించిన పోటీలకు విశేష స్పందన లభించింది.

పాడేరులో ఉత్సాహంగా ముగ్గులు వేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకట్టుకున్న వివిధ రంగవల్లులు

- ఉత్సాహంగా ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో పోటీలు

- ప్రథమ బహుమతి విజేత పి.లక్ష్మి, ద్వితీయ విజేత జె.వేదావతి

తృతీయ విజేత ఎం.కుసుమకుమారి

పాడేరు, జనవరి 8(ఆంధ్రజ్యోతి):

‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌ నిర్వహిస్తున్న టాటా టీ జెమిని ముత్యాల ముగ్గుల పోటీలు... గార్డెనింగ్‌ పార్టనర్‌ క్రాఫ్ట్‌ వారి పర్‌ఫెక్ట్‌.. ఫ్రాగ్రెన్స్‌ పార్టనర్‌ బెట్కో వారి అన్నమయ్య అగరవత్తులు... హెల్త్‌ పార్టనర్‌ అమృతబిందు... ఫ్యాషన్‌ పార్టనర్‌ డిగ్‌సెల్‌ మరియు సెల్సియా’ సారథ్యంలో పాడేరులోని మోదకొండమ్మ ఓపెన్‌ ఆడిటోరియంలో స్థానిక స్పాన్సర్‌ అక్షర ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నిర్వహించిన పోటీలకు విశేష స్పందన లభించింది. అధిక సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలో వివిధ రంగవల్లులు ఆకట్టుకున్నాయి. చలి తీవ్రతను సైతం లెక్క చేయకుండా ఉదయం పది గంటలకే పోటీలో పాల్గొనే మహిళలు ఓపెన్‌ ఆడిటోరియం వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికీ మంచు కురుస్తుండడంతో ఉదయం పదకొండు గంటలకు పోటీలను ప్రారంభించారు. అక్షర ఉన్నత పాఠశాల డైరెక్టర్‌ సీహెచ్‌ రమాదేవి, టీచర్‌ ఎస్‌.గౌరి జడ్జిలుగా వ్యవహరించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగ్గులు వేయడం పూర్తయిన వెంటనే పాల్గొన్న వారందరికీ మోదకొండమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు.

విజేతలకు బహుమతులు

ముగ్గుల పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన పి.లక్ష్మికి జిల్లా ఎస్‌పీ సతీశ్‌కుమార్‌ రూ.6 వేలు, జ్ఞాపికను అందించారు. ద్వితీయ బహుమతి విజేత జె.వేదావతికి మోదకొండమ్మ ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్లి సింహాచలంనాయుడు రూ.4 వేలు, జ్ఞాపికను, తృతీయ బహుమతి విజేత ఎం.కుసుమ కుమారికి అక్షర ఉన్నత పాఠశాల డైరెక్టర్‌ డి.నర్సింహమూర్తి రూ.3వేలు, జ్ఞాపికను అందజేశారు. అలాగే మరో ముగ్గురు మహిళలకు ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు, పోటీల్లో పాల్గొన్న అందరికీ ప్రోత్సాహక బహుమతులను అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు.

Updated Date - 2023-01-09T01:27:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising