ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కైలాసగిరిపై నైట్‌ కాటేజీలు

ABN, First Publish Date - 2023-11-03T01:15:51+05:30

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

వైశాఖి జల ఉద్యానవనంలో ఫుడ్‌ కోర్టులు, గేమింగ్‌ జోన్లు

ఎంజీఎం గ్రౌండ్‌లో రిసార్ట్స్‌

రూ.305 కోట్లతో జగనన్న లేఅవుట్ల అభివృద్ధి

వీఎంఆర్‌డీఏ బోర్డు సమావేశంలో నిర్ణయం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆదాయం పెంచుకునే దిశగా పలు ప్రతిపాదనలు చేసి, బోర్డు ఆమోదం తీసుకుంది. పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో మూడు కీలక ప్రాజెక్టులకు రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌పీఎఫ్‌) పిలవాలని నిర్ణయించారు. కైలాసగిరిపై రాత్రి పూట విడిది బాగుంటుందని, పర్యాటకులను బాగా ఆకర్షిస్తుందనే భావనతో ‘నైట్‌ కాటేజీలు’ 20 వరకు నిర్మించాలని నిర్ణయించారు. ఎవరు ముందుకువస్తే వారికే ఈ ప్రాజెక్టు అప్పగిస్తారు. అలాగే పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయం పక్కనున్న వైశాఖి జల ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అక్కడ ఫుడ్‌ కోర్టులు, ఎంటర్‌టెయిన్‌మెంట్‌ కోసం గేమింగ్‌ జోన్లు పెడతారు. అదేవిధంగా వుడా పార్కు వెనుకనున్న ఎంజీఎం మైదానంలో రిసార్ట్స్‌, బీచ్‌ ఫ్రంట్‌ స్పోర్ట్స్‌ అభివృద్ధి చేయాలని ప్రతిపాదించి ఆమోదం తీసుకున్నారు.

రూ.305 కోట్లతో లేఅవుట్ల అభివృద్ధి

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు నగర శివార్లలో రైతుల నుంచి ప్రభుత్వం భూములు సమీకరించింది. వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. ఇందుకోసం 1,236 ఎకరాల్లో 48 లేఅవుట్లను అభివృద్ధి చేయడానికి రూ.305 కోట్లు కేటాయించారు. దీనికి బోర్డు ఆమోదం తెలిపింది.

- సిరిపురంలో వీఎంఆర్‌డీఏ ఉద్యోగ భవన్‌ ముందు నిర్మిస్తున్న మల్టీ లెవెల్‌ కారు పార్కింగ్‌ నిర్మాణ వ్యయం జీఎస్‌టీ కారణంగా రూ.80 కోట్ల నుంచి రూ.87.53 కోట్లకు పెరిగింది. దీనిని ఆమోదించారు.

- మధురవాడ హైట్స్‌ పేరుతో బల్క్‌ వేలానికి పెట్టిన లేఅవుట్‌కు 100 అడుగుల వెడల్పున అప్రోచ్‌ రహదారి నిర్మించడానికి అనుమతి తీసుకున్నారు.

- జాతీయ రహదారి నుంచి మారికవలస మీదుగా హరిత హౌసింగ్‌ ప్రాజెక్టు వరకు 3.5 కి.మీ. పొడవున గతంలో వేసిన 100 అడుగుల రహదారి పాడైపోవడంతో దానికి రూ.2.9 కోట్లతో కొత్త లేయర్‌ వేయాలని నిర్ణయించారు.

- ఇంజనీరింగ్‌ విభాగంలో దిగువ స్థాయి సిబ్బంది నియామకానికి అనుమతి కోరారు.

- డీఎఫ్‌ఓ సెక్షన్‌లో ప్రస్తుతం రూ.20 లక్షల వరకు సాంకేతికంగా పనులు మంజూరు చేయడానికి అవకాశం ఉండగా దానిని రూ.50 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

- హార్టీకల్చర్‌ సూపర్‌వైజర్ల జీతాలు 18 శాతం పెంచారు.

Updated Date - 2023-11-03T01:15:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising