ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసంపూర్తిగా ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ

ABN, First Publish Date - 2023-02-10T23:48:17+05:30

మండలంలోని మరుపాక రెవెన్యూ పరిధిలో క్వారీ అనుమతుల కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ అసంపూర్తిగా ముగిసింది.

ఫిర్యాదులను తీసుకుంటున్న డీఆర్వో వెంకటరమణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రావికమతం, ఫిబ్రవరి 10 : మండలంలోని మరుపాక రెవెన్యూ పరిధిలో క్వారీ అనుమతుల కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ అసంపూర్తిగా ముగిసింది. ఈ గ్రామంలో సర్వే నంబరు 258లో ఎనిమిది ఎకరాల 51 సెంట్లు భూమిలో రోడ్డు మెటల్‌ బిల్డింగ్‌ స్టోన్‌, బీఎం ఇసుక తయారీకి బీఎం.జె.అప్పారావు కంపెనీ భూగర్భ గనుల శాఖకు దరఖాస్తు చేసింది.. ఈ మేరకు మరుపాకలో శుక్రవారం డీఆర్వో వెంకటరమణ ఆధ్వర్యంలో రెవెన్యూ, భూగర్భ, గనుల, పర్యావరణ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా మరుపాక గ్రామస్థులు క్వారీ తవ్వకాలు, పేలుళ్ల వలన తమ పంటలు జీడి, మామిడి తోటలు నాశనం అవుతాయని, క్వారీకి అనుమతులు ఇవ్వవద్దని అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దరఖాస్తు చేసిన భూమికి ఆనుకుని ఉన్న గొంప, పిల్లవానిపాలెం గ్రామస్థులు క్వారీ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణలో భిన్నాభిప్రాయాలు చోటుచేసుకోవడంతో తదుపరి చర్యలకు రాష్ట్ర పర్యావరణ శాఖకు గ్రామస్థులు అభ్యంతరాలు తెలుపుతూ నివేదిక పంపుతామని డీఆర్వో వెంకటరమణ ప్రకటించారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఉమామహేశ్వరరావు, కొత్తకోట సీఐ సయ్యద్‌ మహ్మద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-10T23:48:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising