ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెము రైళ్లు పునఃప్రారంభం

ABN, First Publish Date - 2023-02-16T00:03:12+05:30

కరోనా మొదలైన వెంటనే నిలిచిపోయిన ‘మెము’ పాసింజర్‌ రైలు సర్వీసులు దాదాపు రెండేళ్ల తరువాత మళ్లీ బుధవారం పునఃప్రారంభమయ్యాయి. విశాఖపట్నం-విజయనగరం, విశాఖపట్నం-పలాస, విశాఖపట్నం-రాజమండ్రి మధ్య ఇవి నడుస్తున్నాయి. వీటిని ఇప్పుడు ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులుగా నడుపుతూ పాసింజర్‌ స్పెషల్‌ అని నామకరణం చేశారు.

పలాస రైలులో ప్రయాణికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టాలెక్కిన విజయనగరం, పలాస,

రాజమండ్రి పాసింజర్‌ స్పెషల్స్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి):

కరోనా మొదలైన వెంటనే నిలిచిపోయిన ‘మెము’ పాసింజర్‌ రైలు సర్వీసులు దాదాపు రెండేళ్ల తరువాత మళ్లీ బుధవారం పునఃప్రారంభమయ్యాయి. విశాఖపట్నం-విజయనగరం, విశాఖపట్నం-పలాస, విశాఖపట్నం-రాజమండ్రి మధ్య ఇవి నడుస్తున్నాయి. వీటిని ఇప్పుడు ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులుగా నడుపుతూ పాసింజర్‌ స్పెషల్‌ అని నామకరణం చేశారు. 07468 నంబరు రైలు విశాఖ నుంచి ఉదయం 6.30 గంటలకు బయలుదేరి 7.50 గంటలకు విజయనగరం చేరుతుంది. అక్కడ నుంచి మరో రైలు (07469 నంబరు) ఉదయం 6.10 గంటలకు బయలుదేరి 7.30 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. అలాగే విశాఖ నుంచి ఉదయం 7.50 గంటలకు బయలుదేరే 07470 నంబర్‌ రైలు మధ్యాహ్నం ఒంటి గంటకు పలాస చేరుతుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు 07471 నంబరుతో బయలుదేరి సాయంత్రం 5.50 గంటలకు విశాఖ చేరుతుంది. ఇకపోతే రాజమండ్రి నుంచి మరో రైలు ఉదయం 9.20 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. తిరిగి ఇక్కడి నుంచి సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి రాత్రి 11.35 గంటలకు రాజమండ్రి చేరుకుంటుంది. ఈ రైళ్లు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల బస్సు చార్జీలు బాగా పెరిగిపోయాయని, అందులో సగం మొత్తంతోనే ఈ రైళ్లలో గమ్యం చేరుకోవచ్చునని చెబుతున్నారు.

రూ.300కి అంతా వెళ్లిపోతాం

జ్యోత్న, పలాస(3389)

మాది పలాస. తరచూ బంధువుల ఇళ్లకు విశాఖపట్నం వస్తుంటాము. బస్సులో వస్తే మనిషికి రూ.200 పైనే చార్జీ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు నలుగురం కేవలం రూ.300కే పలాస వెళ్లిపోతున్నాం

కాలేజీకి వెళ్లిపోతున్నాం

అమృత(3398)

మేము విజయనగరం కాలేజీలో చదువుతున్నాం. కరోనాకు ముందు పాసింజర్‌ రైలులోనే వెళ్లేవాళ్లం. ఇప్పుడు మళ్లీ ప్రారంభించడంతో ఎంతో అనువుగా ఉంది. రద్దీ లేకుండా తక్కువ చార్జీతో త్వరగా వెళ్లిపోతాము.

Updated Date - 2023-02-16T00:03:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising