ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

200 కిలోల గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2023-07-26T22:21:27+05:30

మండలంలోని లబ్బూరు జంక్షన్‌ సమీపంలో స్థానిక పోలీసులు బుధవారం 200 కిలోల గంజాయిని పట్టుకున్నారు.

పోలీసులు పట్టుకున్న గంజాయి, వ్యాన్‌తో పాటు నిందితుడు

ముంచంగిపుట్టు, జూలై 26: మండలంలోని లబ్బూరు జంక్షన్‌ సమీపంలో స్థానిక పోలీసులు బుధవారం 200 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఎస్‌ఐ కె.రవీంద్ర తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. గంజాయి రవాణా జరుగుతున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం రావడంతో లబ్బూరు జంక్షన్‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. బరడ వైపు నుంచి లబ్బూరు వైపు వస్తున్న వ్యాన్‌ను ఆపగా, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిలో ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. ఆ వ్యాన్‌ను తనిఖీ చేయగా అందులో 200 కిలోల గంజాయి ఉంది. పట్టుబడిన నిందితుడు మాకవరం పంచాయతీ లబడపుట్టు గ్రామానికి చెందిన వి.హరిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి అతనిని కోర్టులో హాజరుపరిచారు. తప్పించుకున్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2023-07-26T22:21:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising