ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శరవేగంగా వంతెన నిర్మాణ పనులు

ABN, First Publish Date - 2023-04-19T01:01:25+05:30

బొండాం పంచాయతీ పరిధి జయంతివలస- బొండాం కొత్తవలస మార్గంలో పెద్ద గెడ్డపై వంతెన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ పనులు వైసీపీ అధికారంలోకి వచ్చాక బిల్లులు మంజూరు చేయకపోవడంతో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత బిల్లులు మంజూరు చేయడం, ఇకపై చేపట్టే పనులకు కూడా బిల్లుల మంజూరులో జాప్యం ఉండదని అధికారులు హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్‌ నెల రోజుల క్రితం వంతెన పనులను పునఃప్రారంభించారు.

జయంతివలస- బొండాం కొత్తవలస మధ్య పెద్ద గెడ్డపై చేపడుతున్న వంతెన నిర్మాణ పనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జయంతివలస- బొండాం కొత్తవలస మార్గంలో పునఃప్రారంభం

- గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలు

- వైసీపీ అధికారంలోకి వచ్చాక బ్రేక్‌

- బిల్లుల మంజూరుకు ఢోకా లేదని ఇంజనీరింగ్‌ అధికారులు హామీ ఇవ్వడంతో కదలిక

- నెల రోజుల క్రితం పనులు మొదలెట్టిన కాంట్రాక్టర్‌

- వర్షాకాలం నాటికి పూర్తి చేయాలని లక్ష్యం

- తీరనున్న రెండు మండలాల ప్రజల కష్టాలు

అరకులోయ, ఏప్రిల్‌ 18:

బొండాం పంచాయతీ పరిధి జయంతివలస- బొండాం కొత్తవలస మార్గంలో పెద్ద గెడ్డపై వంతెన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ పనులు వైసీపీ అధికారంలోకి వచ్చాక బిల్లులు మంజూరు చేయకపోవడంతో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత బిల్లులు మంజూరు చేయడం, ఇకపై చేపట్టే పనులకు కూడా బిల్లుల మంజూరులో జాప్యం ఉండదని అధికారులు హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్‌ నెల రోజుల క్రితం వంతెన పనులను పునఃప్రారంభించారు.

జయంతివలస- బొండాం కొత్తవలస మార్గంలో పెద్ద గెడ్డ ఉంది. వర్షాలు కురిస్తే ఈ గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుంది. బొండాం కొత్తవలస దాటిన తరువాత అనంతగిరి మండలం శివారు కోనాపురం, బొర్రా పంచాయతీలు వస్తాయి. సాధారణ రోజుల్లో గెడ్డలోంచి ఆటోలు, ద్విచక్ర వాహనాలు వెళతాయి. అయితే వర్షాలు కురిసినప్పుడు రాకపోకలు నిలిచిపోతాయి. ఆ సమయంలో 15 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించి గమ్యస్థానం చేరుకోవలసి ఉంటుంది. దీని వల్ల రెండు మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని గత టీడీపీ ప్రభుత్వం పెద్ద గెడ్డపై వంతెన నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ పిల్లర్ల స్థాయి వరకు నిర్మాణం చేపట్టారు. అయితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులను నిలిపివేశారు. కొంత కాలానికి చేపట్టిన పనులకు బిల్లులు మంజూరైనా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్‌ సుముఖత చూపలేదు. వంతెన అసంపూర్తిగా నిలిచిపోవడంతో వర్షాకాలంలో బొండాం కొత్తవలస, జయంతివలస, కొల్యాగుడ, బొండ్యాగుడ, కోనాపురం తదితర గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై పలుమార్లు పత్రికల్లో కథనాలు రావడంతో స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ఈ విషయాన్ని ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇంజనీరింగ్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో కాంట్రాక్టర్‌తో ఇంజనీరింగ్‌ అధికారులు మాట్లాడి పనులు పునఃప్రారంభించేలా ఒప్పించారు. ముందుగా ఒప్పందం కుదిరిన మేరకు వంతెన నిర్మాణం పూర్తయ్యేలా, రూ.71 లక్షలతో వంతెనకు ఇరువైపులా రహదారి నిర్మాణం చేపట్టేందుకు కాంట్రాక్టర్‌ అంగీకరించి నెల రోజుల క్రితం పనులు ప్రారంభించారు. ఈ పనులు వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు టీడబ్ల్యూ ఏఈఈ అభిషేక్‌ తెలిపారు.

Updated Date - 2023-04-19T01:01:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising