ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

27 నుంచి టీడీపీ బస్సుయాత్ర

ABN, First Publish Date - 2023-06-25T01:31:46+05:30

విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఈనెల 27వ తేదీ నుంచి జూలై ఒకటో తేదీ వరకు ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరిట బస్సు యాత్ర నిర్వ హిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొలి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే...

పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

విశాఖపట్నం, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఈనెల 27వ తేదీ నుంచి జూలై ఒకటో తేదీ వరకు ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరిట బస్సు యాత్ర నిర్వ హిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రకటించారు. శనివారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ 27న గాజువాక నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. రాజమండ్రి మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించిన తొలి మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను ప్రజలకు తెలియ జేయడానికి ఈ బస్సు యాత్ర చేపట్టామన్నారు. నార్త్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాఽధించడం ఖాయమన్నారు. దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది తెలుగు దేశమేనన్నారు. ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లా డుతూ విశాఖలో బస్సు యాత్రను విజయవంతం చేయా లని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమా వేశంలో అసెంబ్లీ ఇన్‌చార్జులు గండి బాబ్జీ, కోళ్ల లలిత కుమారి, కోరాడ రాజబాబు, ఇంకా నజీర్‌, పాశర్ల ప్రసాద్‌, పీలా శ్రీనివాసరావు, చిక్కాల విజయ్‌, కోళ్ల రాంప్రసాద్‌, కార్పొరేటర్లు గొలగాని వీరారావు, గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-25T01:31:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising