ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పోలీసుల తీరు అమానుషం

ABN, First Publish Date - 2023-10-04T01:09:25+05:30

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని అరెస్టు చేసిన పోలీసుల తీరు అమానుషమని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న పీలా గోవింద

అనకాపల్లిటౌన్‌, అక్టోబరు 3: మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని అరెస్టు చేసిన పోలీసుల తీరు అమానుషమని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అరంగడల్‌పేటకు చెందిన ఎస్‌ఐ నాగరాజు టీవీలో సీఎం జగన్‌రెడ్డిపై బండారు చేసిన వ్యాఖ్యలను చూసి మనస్తాపానికి గురై కేసు నమోదు చేయడం, దీనిపై అర్ధరాత్రి అరెస్టు చేయడానికి రావడం అమానుషమన్నారు. బండారును అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు. అత్యుత్తమైన అసెంబ్లీ స్పీకర్‌ సీటులో తమ్మినేని సీతారాం కూర్చొని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. నెల్లూరు జిల్లాకు చెంది న ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి బండారుపై అసత్య ప్రకటనలు చేస్తున్నారన్నారు. బండారు విషయంలో న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందన్నారు. సమావేశంలో నాయకులు మాదంశెట్టి నీలబాబు, బీఎస్‌ఎంకే జోగినాయుడు, మళ్ల సురేంద్ర, పోలారపు త్రినాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-10-04T01:09:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising