ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చంద్రబాబు అరెస్టుపై టీడీపీ శ్రేణులు ఆందోళనలు

ABN, First Publish Date - 2023-09-10T01:38:20+05:30

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఆ పార్టీ నేతలు భగ్గుమన్నారు. పెద్ద ఎత్తున వడ్డాదిలో నిరసన ర్యాలీ నిర్వహించారు.

1 కె.కోటపాడు మండలం కూండ్రపువానిపాలెంలో నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు

సఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు

తెల్లవారుజాము నుంచి పలువురు నాయకులు గృహ నిర్బంధం

మరికొందరిని అరెస్టు చేసి వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలింపు

బుచ్చెయ్యపేట, సెప్టెంబరు 9 : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఆ పార్టీ నేతలు భగ్గుమన్నారు. పెద్ద ఎత్తున వడ్డాదిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బీఎన్‌ రోడ్డులో పొట్టిదొరపాలెం వద్ద నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పార్టీ శ్రేణులు మండల వ్యాప్తంగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో నాయకులు గోకివాడ కోటేశ్వరరావు, శిరిగిరిశెట్టి శ్రీరామూర్తి, డొంకిన అప్పలనాయుడు, ఎంవీవీ సత్యనారాయణ, కె.సత్యనారాయణ, దొండా నరేష్‌, శిరిగిరిశెట్టి శ్రీరామూర్తి, మలిరెడ్డి బాబ్జి, మరిసా సతీష్‌, వెలంకాయల అప్పలనాయుడు, దొండా రమేష్‌, సింగంపల్లి రమేష్‌, దొండా గిరిబాబు, సాయం శేషు, గొన్నాబత్తుల శ్రీను, దొడ్డి కిషోర్‌, సూరాతి పేరమ్మ, దొండా శ్రీను, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శనివారం రాత్రి బుచ్చెయ్యపేటలో టీడీపీ శ్రేణులు కాగడాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొన్నాబత్తుల శ్రీనివాసరావు, కోరుకొండ రవికుమార్‌, ముచ్చకర్ల తాతయ్యలు, దొండా నరేష్‌, మరిసా సతీష్‌, గోకివాడ సత్యారావు, సాయం శేషు, దొండా గిరిబాబు, సుంకర లక్ష్మి, కంచిపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

నర్సీపట్నం : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పోలీసులు ఇక్కడ పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ కౌన్సిలర్‌ డబ్బీరు శ్రీకాంత్‌, నేతల నాగేశ్వరరావు, మురళి, పైల గోవిందరావులను ఇక్కడ అరెస్టు చేసి ఎస్‌. రాయవరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పట్టణ పార్టీ కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ, పెదిరెడ్ల చింతు, కొరుప్రోలు శ్రీనివాసరావులను అరెస్టు చేసి రోలుగుంట పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. తెల్లవారు జాము నుంచి ఉదయం పది గంటలు వరకు ఆర్టీసీ బస్సులను ఆపేశారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నర్సీపట్నం అర్బన్‌ : మండలంలోని ధర్మసాగరంలో జడ్పీటీసీ సుకల రమణమ్మను పోలీసులు శనివారం ఉదయం హౌస్‌ అరెస్టు చేశారు. ఆమెను రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తామని ఎస్‌ఐ రామారావు తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఆమె ఇంటికి చేరుకుని నిరసన తెలియజేశారు. పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు అప్పికొండ రాజు, కలిమి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

గొలుగొండ : టీడీపీ అధినేత అరెస్టు నేపథ్యంలో మండలంలోని పలుగ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, మాజీ సర్పంచ్‌లు సుర్ల బాబ్జి, కొల్లి సత్యనారాయణ, నల్లబెల్లి నూకరాజులను స్టేషన్‌కు తరలించారు. పలువురు నాయకులను హౌస్‌ అరెస్టు చేశారు. చీడిగుమ్మల, జోగంపేట జంక్షన్‌లో నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. నాయకులు భీమిరెడ్డి సత్యనారాయణ, కామిరెడ్డి గోవింద్‌, కృష్ణ, రాయపురెడ్డి లక్ష్మీనాయుడు, గెడ్డం ఆనంద్‌, రాంబాబులతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు.

కృష్ణాదేవిపేట : చంద్రబాబును అరెస్టు చేసిన సందర్భంగా కృష్ణాదేవిపేట, చోద్యం, కొంగసింగి, నాగాపురం, గింజర్తి తదితర గ్రామాల్లో పలువురు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులను కృష్ణాదేవిపేట పోలీసులు స్టేషన్‌కు తరలించగా, మరికొంతమందిని హౌస్‌ అరెస్టులు చేశారు. మాజీ జడ్పీటీసీ టికెల తారకవేణుగోపాల్‌, చోద్యం సర్పంచ్‌ అదపురెడ్డి గోపాలకృష్ణ, గింజర్తి మాజీ సర్పంచ్‌ సత్యనారాయణ, వరహాలబాబు ప్రభుత్వ చర్యలను ఖండించారు.

మాకవరపాలెం : మాజీ సీఎం చంద్రబాబును పోలీసులు అరెస్టు చేయడంతో శనివారం తెల్లవారుజాము నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాకవరపాలెం బస్‌స్టాండ్‌ వద్ద ఆందోళన చేపట్టారు. సుమారు మూడు గంటల పాటు వాహనాలను నిలిపివేశారు. షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని చెదరగొట్టి అరెస్టు చేశారు. టీడీపీ మండల అధ్యక్షడు ఆర్‌వై పాత్రుడు, శెట్టిపాలెం సర్పంచ్‌ అల్లు రామూనాయుడు, భీమబోయినపాలెం సర్పంచ్‌ రుత్తల నందకిశోర్‌, నాయకులు కోసూరు శ్రీను, బుచ్చినాయుడు, ఒబ్బలరెడ్డి గోవిందతో పాటు మరో 15మందిని అరెస్ట్‌ చేసి రోలుగుంట పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ఆందోళనలో నాయకులు చిరంజీవి, సురేష్‌ పాల్గొన్నారు.

నాతవరం : చంద్రబాబు అరెస్టుపై మండలంలో పలుచోట్ల టీడీపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని నర్సీపట్నం, నాతవరం పోలీస్టేషన్లకు తరలించి అరెస్టు చేశారు. నాతవరంలో పార్టీ నాయకుడు నానాజీ ఆధ్వర్యంలో మెయిన్‌రోడ్డుపై నిరసన తెలిపారు. తాండవ సెంటర్‌లో పార్టీ అనకాపల్లి పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు కరక సత్యనారాయణ ఆధ్వర్యంలో తుని-నర్సీపట్నం రూట్‌లోని రోడ్డుపై కూర్చొని నిరసన తెలపడంతో సూమారు గంటన్నరపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అలాగే తాండవ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్‌ పారుపల్లి కొండబాబు, మండల తెలుగు యువత అధ్యక్షుడు శెట్టి లోవలను నాతవరం పోలీస్‌ స్టేషన్లకు తరలించి అరెస్టు చేయగా, ఆ తరువాత మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ ఇటంశెట్టి సీతారామ్మూర్తి, వనిమిన సూర్యారావులను అరెస్టు చేశారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో నాయకులు మాజీ ఎంపీపీ సింగంపల్లి సన్యాసిదేముడు, పైల సూరిబాబు, చిటికెల రాజుబాబు, అంకంరెడ్డి శివ, చింతకాయల శివ, లాలం రమణ, కొండ్రు మరిడియ్య తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే, చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారంటూ నాతవరంలో టీడీపీ నాయకులు శనివారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. తాండవ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్‌ పారుపల్లి కొండబాబు, మహిళా నాయకురాలు పారుపల్లి కృష్ణవేణి, మాజీ ఎంపీటీసీ ఇటంశెట్టి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.

చోడవరం: టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన పోలీసులు శనివారం తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే రాజు, గోవాడ షుగర్స్‌ మాజీ చైర్మన్‌ మల్లునాయుడుతో పాటు ఇతర ముఖ్య నేతలను అరెస్టుచేసి కె.కోటపాడు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విశాఖలో తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మల్లునాయుడుడిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు, అక్కడనుంచి కె.కోటపాడు స్టేషన్‌కు తరలించారు. వీరితో పాటు, మాజీ జడ్పీటీసీ మత్స్యరాజు, ఎస్సీసెల్‌ నాయకుడు ఎలకా మల్లిబాబు, టీడీపీ నేతలు దేవరపల్లి వెంకట అప్పారావు, కొట్టాపు చిన్న, ఈర్లె శ్రీనివాస్‌, ముడుసు గోవింద్‌ తదితరులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఇదిలావుంటే, చంద్రబాబు అరెస్టు విషయంలో సీఎం జగన్‌ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ విమర్శించారు. శనివారం తెల్లవారుజామున ఆయనను అరెస్టు చేసిన పోలీసులు చోడవరం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు. వెంకన్నపాలెం జంక్షన్‌లో శనివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే రాజు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు, మాజీ జడ్పీటీసీ మత్స్యరాజు, మండల నాయకుడు బొడ్డేడ గంగాధర్‌, ఎస్‌సీ సెల్‌ నాయకులు ఎలకా మల్లిబాబు, కార్యకరక్తలు పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో శనివారం మండలంలోని 34 మంది టీడీపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.

కె.కోటపాడు : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మండలంలో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. చంద్రబాబు అరెస్టు అన్యాయమని టీడీపీ మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ అన్నారు. ఈ అరెస్టును నిరసిస్తూ కె.కోటపాడులో ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కేఎస్‌ఎన్‌ రాజు, గవిరెడ్డి రామానాయుడు, గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్‌ గూనూరు మల్లునాయుడు, నాయకులు ప్రసాదరావు తదితరులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. సీఐ డి.తాతారావు, ఎస్‌ఐలు ధనుంజయ, రామకృష్ణలు వీరిని స్టేషన్‌కు తరలించారు. ఇదిలావుంటే, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు కె.కోటపాడులోని గాంధీబొమ్మ విగ్రహం జంక్షన్‌ నుంచి పార్టీ శ్రేణులతో కలిసి అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కోటపాడు జంక్షన్‌లో శనివారం ఉదయం పైలా ప్రసాదరావుతో సహా పలువురు నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. పోలీసులు పైలాతో సహా పలువురు నేతలను కశింకోట పోలీస్‌స్టేషన్‌కు జీపులో తరలించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని టీడీపీ మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అన్యాయంగా ఇరికించి అరెస్టు చేశారన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని ఏదో కేసులో ఇరికించి జైలులో పెడుతున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో నాయకులు జూరెడ్డి రాము, దాడి ఎరుకునాయుడు, కశిరెడ్డి అప్పలనాయుడు, కన్నూరి సూర్యనారాయణ పాల్గొన్నారు.

రావికమతం : చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రావికమతం, కొత్తకోటలలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. చోడవరం నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు కోట నీలవేణి, పార్టీ మండల అధ్యక్షుడు రాజన కొండనాయుడు ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. కొత్తకోటలో ర్యాలీ నిర్వహిస్తున్న నీలవేణిని, ఆమె భర్త గోవిందరావు, కోట సత్యనారాయణలను సీఐ స్టేషన్‌కు తరలించి, సాయంత్ర విడిచిపెట్టారు. అలాగే రావికమతంలో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. నాయకులు ఉప్పులూరి నాగేశ్వరరావు, రావికమతం, మేడివాడ, చినపాచిల సర్పంచ్‌లు గెంజి మంగ, వజ్రపు లీల, కోమటపు రామలక్ష్మి తదితర టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

రోలుగుంట : రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని టీడీపీ మండల నాయకులు ధ్వజమెత్తారు. చంద్రబాబును అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పార్టీ శ్రేణులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి రోలుగుంటలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక మెయిన్‌ రోడ్డులో సీఎం జగన్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేసి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు నాయకులను ముందస్తు అరెస్టు హౌస్‌ అరెస్టు చేపట్టారు. మాజీ వైస్‌ఎంపీపీ పరిసం లోవరాజు, కోలిపల్లి ఈశ్వరరావు, ఉలబాల పోతురాజునాయుడు, ఒనుం శ్రీనివాసరావు, బి.నరేష్‌, రొంగలి రమణ, పోతల శ్రీను, కొప్పుల వరలక్ష్మి, సుర్ల బాబులునాయుడు, పెద్దినాయుడు, బంటు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మాడుగుల: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ మాడుగులలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు వడ్డాది రంజిత్‌వర్మ ఆధ్వర్యంలో బస్‌ స్టాండ్‌ ఆవరణలో నల్ల బ్యాడ్జీలను ధరించి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై అంతా మండిపడ్డారు. నినాదాలతో ర్యాలీగా వెళ్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పుప్పాల అప్పలరాజు, టీడీపీ మండల అధ్యక్షుడు అద్దెపల్లి జగ్గారావు, రంజిత్‌ వర్మ, బుద్దాల రమణతో సహా తదితరులు పాల్గొన్నారు.

దేవరాపల్లి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కక్షపూరితంగా అరెస్టు చేయడం అన్యాయమని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ శ్రేణులు ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దేవరాపల్లిలో ఆ పార్టీ నాయకులు గొర్లె దేముళ్లు, గుల్లిపల్లి అర్జునరావు, గవిరెడ్డి దేమున్నాయుడు, శంకర్‌,బండారు అప్పలనాయుడు, బాలకృష్ణ ఆద్వర్యంలో కళ్లకు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. రైవాడలో చల్లా నానాజీ నిరసన తెలిపారు. కాశీపురంలో పార్టీ మండల అధ్యక్షుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. ఎస్‌ఐ బి.మల్లికార్జునరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఆందోళనకారులను స్టేషన్‌కు తరలించారు. నాయకులు చెరకాన సూర్యనారాయణ, సోమిరెడ్డి గోవింద, కిల్లి గోవింద, పెంటకోట అప్పలనాయుడు, గంధం జగన్‌, సాంబమూర్తి, ఆదిరెడ్డి సింహాచలంనాయుడు, రాజినాయుడు, తమడాన ప్రసాద్‌, సంతోష్‌, అప్పారావు, కొట్యాడ రవి ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.

చీడికాడ : చంద్రబాబును అరెస్టు చేయడం అన్యాయమని మాజీ ఎంపీపీలు పోతల రమణమ్మ, కుచ్చు కళావతి అన్నారు. శనివారం చీడికాడలోని ఎన్టీఆర్‌ విగ్రహం ముందు మెయిన్‌ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏఎస్‌ఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలను స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. టీడీపీ మండల అధ్యక్షుడు పోతల చిన్నంనాయుడు, నాయకులు రెడ్డి సన్యాసినాయుడు, బొబ్బాది తాతారావు, పేరపు కొండబాబు, పైల ముత్యాలనాయుడు, కోటేశ్వరరావు, పంచాడ దాలెంనాయుడు, గణేశ్‌, కొల్లి సూరినాయుడు తదితర నాయకులపై కేసులు నమోదు చేశారు.

Updated Date - 2023-09-10T01:38:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising