భవిష్యత్తుకు గ్యారెంటీపై ప్రజల్లో చర్చ జరగాలి

ABN, First Publish Date - 2023-06-12T00:53:21+05:30

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మహానాడులో ప్రకటించిన భవిష్యత్తుకు గ్యారెంటీని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు.

భవిష్యత్తుకు గ్యారెంటీపై ప్రజల్లో చర్చ జరగాలి
సదస్సులో ప్రసంగిస్తున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్బవరం, జూన్‌ 11 :తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మహానాడులో ప్రకటించిన భవిష్యత్తుకు గ్యారెంటీని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో భవిష్యత్తుపై గ్యారెంట్‌ కార్యక్రమంపై జరిగిన పెందుర్తి నియోజకవర్గ స్థాయిలో సదస్సులో ఆయన మాట్లాడారు. మహానాడులో బాబు ప్రకటించిన మేనిఫెస్టో వైసీపీకి కాపీ అని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారని, అయితే వైసీపీ పథకాలన్నీ టీడీపీ పథకాలేనని, వాటికి పేర్లు మార్చి నవరత్నాల పేరుతో అమలు చేస్తున్నారన్నారు. గతంలో టీడీపీ పెట్టిన పథకాలనే మరింత మెరుగు పరిచి అధినేత ప్రకటించారన్నారు. కొత్తగా పెట్టిందైతే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఒక్కటే అని అన్నారు. దీనిపై ప్రజల్లో చర్చ జరిగేలా అధినేత త్వరలోనే 90 రోజుల కార్యక్రమాన్ని ప్రకటిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మహాలక్ష్మినాయుడు, మూడు మండలాల నాయకులు గండి రవికుమార్‌, ముత్యాలనాయుడు, దేముడు, పైల జగన్నాఽథం, కొటాన అప్పారావు, బొండా సత్యారావు, మాసవరపు అప్పలనాయుడు, వియ్యపు చిన్నా, పల్ల తాతారావు, దాసరి రమణ, దొడ్డి ప్రకాష్‌, గవర అప్పారావు, కోరాడ శ్రీను పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-12T00:53:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising