తెలుగు భాష సుందరమైనది
ABN, First Publish Date - 2023-02-25T01:03:26+05:30
తెలుగుభాష అత్యంత సుందరమైనదని ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ డానియల్ నెజర్స్ అన్నారు.
అనకాపల్లి, ఫిబ్రవరి 24: తెలుగుభాష అత్యంత సుందరమైనదని ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ డానియల్ నెజర్స్ అన్నారు. శుక్రవారం స్థానిక హిమశేఖర్ స్కూల్‌లో తెలుగు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగుకు వెలుగునిద్దాం అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాశ్చాత్య దేశాల్లో తెలుగుభాషకు మంచి గుర్తింపు ఉందన్నారు. తెలుగుభాష అమ్మ వంటిదన్నారు. అనంతరం సమితి సభ్యులు డానియల్ నెజర్స్‌ను శాలువ, పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు రాచకొండ దశరధరామయ్య, డాక్టర్ శశిధర్, కొయిలాడ రామ్మోహన్ పాల్గొన్నారు.
Updated Date - 2023-02-25T01:03:27+05:30 IST