కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీ20 మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తి

ABN, First Publish Date - 2023-11-22T01:15:41+05:30

భారత్‌, ఆస్ర్టేలియా జట్ల మధ్య గురువారం పీఎం పాలెం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్న అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తిచేశామని నిర్వాహక కమిటీ ప్రతినిధులు కలెక్టెర్‌ మల్లికార్జున, నగర పోలీసు కమిషన్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌, జీవీఎంసీ కమిషన్‌ సాయికాంత్‌వర్మ, ఏసీఏ కార్యదర్శి గోపీనాథరెడ్డి తెలిపారు.

టీ20 మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తి

నిర్వాహక కమిటీ ప్రకటన

విశాఖపట్నం (స్పోర్ట్సు), నవంబరు 21:

భారత్‌, ఆస్ర్టేలియా జట్ల మధ్య గురువారం పీఎం పాలెం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్న అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తిచేశామని నిర్వాహక కమిటీ ప్రతినిధులు కలెక్టెర్‌ మల్లికార్జున, నగర పోలీసు కమిషన్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌, జీవీఎంసీ కమిషన్‌ సాయికాంత్‌వర్మ, ఏసీఏ కార్యదర్శి గోపీనాథరెడ్డి తెలిపారు. మంగళవారం స్టేడియంలో జరిగిన నిర్వాహక కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో మ్యాచ్‌ నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. పోలీసు కమిషనర్‌ మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా మళ్లింపు చర్యలు చేపడుతున్నామన్నారు. జీవీఎంసీ కమిషనర్‌ మాట్లాడుతూ స్టాళ్లలో నిర్ణయించిన ధరలకే ఆహార పదార్థాలు విక్రయించేలా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏసీఏ కార్యదర్శి గోపీనాథరెడ్డి మాట్లాడుతూ స్టేడియం లోపలకు ప్రవేశించే సమయంలో తొక్కిసలాటకు తావివ్వకుండా క్యూ పద్ధతి పాటించాలన్నారు.

Updated Date - 2023-11-22T01:15:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising