ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రక్షణ స్తంభాల నాణ్యత ఘోరం

ABN, First Publish Date - 2023-07-06T00:41:06+05:30

మండలంలోని వనుగుమ్మ నుంచి రంగబయలు మీదుగా జోడిగుమ్మ వరకు నిర్మించిన రహదారి విషయంలో నాణ్యతాలోపాలు బయటపడుతున్నాయి.

కొసంపుట్టు సమీపంలో మలుపు వద్ద విరిగి పడిపోయిన రక్షణ స్తంభాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వనుగుమ్మ- జోడిగుమ్మ ఘాట్‌ రోడ్డు మలుపు వద్ద నేలకొరుగుతున్న సిమెంట్‌ స్తంభాలు

తేలికపాటి వర్షానికే ధ్వంసమవుతున్న వైనం

ముంచంగిపుట్టు, జూలై 5: మండలంలోని వనుగుమ్మ నుంచి రంగబయలు మీదుగా జోడిగుమ్మ వరకు నిర్మించిన రహదారి విషయంలో నాణ్యతాలోపాలు బయటపడుతున్నాయి. ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన పథకం కింద పంచాయతీరాజ్‌ శాఖ రూ.16.9 కోట్లు వెచ్చించి వనుగుమ్మ నుంచి రంగబయలు పంచాయతీ కేంద్రం మీదుగా జోడిగుమ్మ వరకు నిర్మించిన రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు పలు చోట్ల దెబ్బతిన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈ మార్గంలో మలుపుల వద్ద ఉన్న సిమెంట్‌ రక్షణ స్తంభాలు పలుచోట్ల నేలకొరిగాయి.

మూడు నెలలకే దెబ్బతింటున్న స్తంభాలు

ఈ మార్గంలో సిమెంట్‌ రక్షణ స్తంభాలు ఏర్పాటు చేసి మూడు నెలలే కావస్తున్నది. వాస్తవానికి ఘాట్‌ మార్గంలో మట్టి కాస్త లూజుగా ఉంటుంది. సుమారు అడుగు లోతు తీసి కాంక్రీట్‌తో సిమెంట్‌ రక్షణ స్తంభాలను ఏర్పాటు చేయాలి. అయితే ఇక్కడ చిన్న గొయ్యి తీసి అందులో సిమెంట్‌ స్తంభాలు నిలబెట్టినట్టు తెలిసింది. అది కూడా రెండు, మూడు సన్నపాటి ఇనుప ఊచలు వేసి సిమెంట్‌ స్తంభాలను తయారు చేసినట్టు తెలుస్తోంది. అందుకే తేలికపాటి వర్షం కురిసినా అవి నేలకొరిగిపోతున్నాయి. రహదారితో పాటు రక్షణ స్తంభాలు నాణ్యత లేకుండా ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మలుపుల వద్ద ప్రమాదాలు జరగకుండా ఏర్పాటు చేయాల్సిన రక్షణ స్తంభాల విషయంలో కూడా కాంట్రాక్టరు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడుతున్నారు. అధికారులు స్పందించి ఈ రహదారితో పాటు రక్షణ స్తంభాల నాణ్యతపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2023-07-06T00:41:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising