ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

డోలీలో ఆస్పత్రికి మహిళ తరలింపు

ABN, First Publish Date - 2023-07-17T23:41:58+05:30

మండలంలోని కోనాం శివారు జాజులపాలెం గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు. గ్రామంలో పలువురు జ్వరాలతో బాధపడుతుండగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో సోమవారం మాడుగుల ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు జాజులపాలెం గ్రామం నుంచి బ్రాహ్మణగెడ్డ మీదుగా గుడివాడ వరకు ఇద్దరు గిరిజనులు డోలీ కట్టి తీసుకువెళ్లారు.

గిరిజన మహిళను డోలీలో తీసుకువెళుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాజులపాలెంలో జ్వరాల విజృంభణ

గిరిజనులకు తప్పని కష్టాలు

చీడికాడ, జూలై 17: మండలంలోని కోనాం శివారు జాజులపాలెం గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు. గ్రామంలో పలువురు జ్వరాలతో బాధపడుతుండగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో సోమవారం మాడుగుల ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు జాజులపాలెం గ్రామం నుంచి బ్రాహ్మణగెడ్డ మీదుగా గుడివాడ వరకు ఇద్దరు గిరిజనులు డోలీ కట్టి తీసుకువెళ్లారు. గ్రామంలో సుమారు 40 కుటుంబాలు నివాసముంటున్నాయి. వీరిలో కొంతమంది జ్వరాలతో బాధపడుతున్నారు. ఇప్పటికే పొట్టంగి చిన్నారి, దుప్పి నర్సమ్మలను మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పొట్టంగి ముత్యాలమ్మ, చూకూరి నూకాలమ్మ, తాడి బసమ్మలతోపాటు పలువురు గిరిజనులు జ్వరాలతో బాధపడుతుండగా, వీరిలో ముత్యాలమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో డోలీకట్టి గుడివాడ వరకు తీసుకువచ్చి అక్కడి నుంచి మాడుగుల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Updated Date - 2023-07-17T23:41:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising