ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎ‘వరి’ పనుల్లో వారు బిజీబిజీ

ABN, First Publish Date - 2023-07-29T00:16:37+05:30

మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వాగులు, గెడ్డలు ప్రవహించడంతో మండలంలో వరి నాట్లు ప్రారంభమైయ్యాయి. గంటికొర్లాం, భట్లోవ, కోమళ్లపూడి, వడ్డాది, చినఅప్పన్నపాలెం తదితర గ్రామాల్లో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా మారారు.

కె.కోటపాడు మండలం సూరెడ్డిపాలెంలో రైతులతో కలిసి నాట్లు వేస్తున్న జడ్పీటీసీ ఈర్లె అనూరాధ

కూలీలతో కలిసి దమ్ములు, గట్లువేత, నారుతీత, నాట్లఓ నిమగ్నం

బుచ్చెయ్యపేట, జూలై 28 : మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వాగులు, గెడ్డలు ప్రవహించడంతో మండలంలో వరి నాట్లు ప్రారంభమైయ్యాయి. గంటికొర్లాం, భట్లోవ, కోమళ్లపూడి, వడ్డాది, చినఅప్పన్నపాలెం తదితర గ్రామాల్లో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా మారారు. దమ్ములు, గట్టువేత, నారు తీత, నాట్లు పనులతో పొలాల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఆలస్యమైతే కూలీల కొరత ఎదుర్కొనాల్సి వస్తుందని భావించిన పలువురు రైతులు వరి నాట్లు పనులను ముమ్మరం చేశారు. ఇదిలావుంటే వ్యవసాయంలో యాజమాన్య పద్ధతులపై మండల వ్యవసాయాధికారి భాస్కరరావు పలు సూచనలు చేశారు. వరినాట్లు వేయడానికి ముందే పొలాన్ని దమ్ముచేసుకోవాలన్నారు. రేగడి భూముల్లో నాట్లు వేయడానికి రెండు రోజులు ముందుగానే దమ్ము చేయాలన్నారు. నాలుగు, ఆరు ఆకులున్న లేతాకుపచ్చ నారు అయితే మూన త్వరగా తిరుగుతుందని వివరించారు. పైపైన నాట్లు నాటితే పిలకలు ఎక్కువగా తొడుగుతాయన్నారు. నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి చదరపు మీటరుకు 33 మూనలు ఉండేలా నాటాలన్నారు. నాటిని తర్వాత ప్రతి రెండు మీటర్లకు 30సెం.మీ. బాటలు తీయడం వలన పైరుకు గాలి, వెలుతురు బాగా తగులుతాయన్నారు. తద్వారా చీడపీడలు ఉధృతి కొంత వరకు అదపుకాగలవని పేర్కొన్నారు. అలాగే, ఎరువులు, పురుగుల మందులు, కలుపు మందులు వేయడానికి ఇంకా పైరు పరిస్థితిని గమనించడానికి ఈ బాటలు ఉపయోగపడతాయన్నారు. ఎరువులను సమతుల్యంగా వేసుకోవాలన్నారు. నత్రజని, భాస్వరం, పొటాష్‌ ఎరువులను 2ః1ః1 నిష్పత్తిలో వేసుకోవలని ఆయన రైతులకు సూచించారు.

చీడికాడ : తాజా వర్షాల కారణంగా మండలం లోని పలు గ్రామాల్లో వరినాట్లు ప్రారంభమ య్యాయి. విత్తనాలు వేసే సమయంలో వర్షాలు కురవకపోయినా అడపాదడపా చిన్నచిన్న చినుకులు పడడంతో పలువురు రైతులు వరి విత్తనాలు వేశారు. దీంతో ఆయా పొలాల్లో ఆకు పెరగడంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లో నీరు చేరడంతో నాట్లను ప్రారంభించారు.

కె.కోటపాడు : మండలంలోని సూరెడ్డిపాలెంలో శుక్రవారం జడ్పీటీసీ ఈర్లె అనూరాధ తమ పొలంలో కూలీలతో కలిసి వరినాట్లు వేశారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు కుమార్తె, స్త్రీ శిశు సంక్షేమశాఖ జిల్లా చైర్‌పర్సన్‌ అయిన ఈమెది వ్యవసాయ కుటుంబం కావడంతో చిన్ననాటినుంచి ఆ రంగంపై కూడా మక్కువే. దీంతో ఆమె కూలీలతో కలిసి నాట్లు వేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు.

Updated Date - 2023-07-29T00:16:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising